AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: చంద్రబాబును రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించాలి…సంతకాలతో వైసీపీ ఎమ్మెల్యే లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి జగన్‌పై చేసిన...

AP Politics: చంద్రబాబును రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించాలి...సంతకాలతో వైసీపీ ఎమ్మెల్యే లేఖ
Basha Shek
|

Updated on: Oct 25, 2021 | 12:05 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి జగన్‌పై చేసిన వ్యాఖ్యలు..అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతల దాడులు, ప్రతిదాడులతో రాష్ట్ర రాజకీయాలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మరికొందరు నేతలు దిల్లీ బాట పట్టారు. మరోవైపు టీడీపీ సభ్యత్వం రద్దు చేయాలని వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు వరసగా లేఖలు రాస్తున్నారు. తాజాగా టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్‌ను దుర్భాషలాడారని నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ మేరకు చంద్రబాబును రాజకీయాల నుంచి తప్పించాలని డిమాండ్‌తో సంతకాలు సేకరించిన ఈ లేఖను జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబుకు అందజేశారు. ‘పట్టాభి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికొచ్చినట్లు తిట్టాడు. ఒకటి కాదు…రెండుసార్లు పదే పదే బూతు పదాలతో జగన్‌ను తూలనాడాడు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఉద్దేశపూర్వకంగానే పట్టాభి అసభ్యకర వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటు. ఒక పార్టీ అధినేతగా ఉండి ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సమర్థనీయం కాదు. చంద్రబాబు 36 గంటలు ఎందుకు దీక్ష చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. పట్టాభి లాంటి వారిని ప్రోత్సహిస్తోన్న ఆయనను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించాలి ‘ అని ఎమ్మెల్యే ఈ లేఖలో పేర్కొన్నారు.

Also Read:

Chandrababu Delhi Tour: రాష్ట్రపతిని కలవనున్న చంద్రబాబు.. ఢిల్లీ టూర్ లో కీలక సన్నివేశాలు.. ఏపీ రాజకీయాల్లో ఎం జరగబోతుంది..(లైవ్ వీడియో)

Chandrababu Delhi Tour: ఢిల్లీ పెద్దల వద్దకు ఏపీ పంచాయితీ.. నేడు హస్తినకు చంద్రబాబు.. రాజకీయ పరిస్థితులపై ఫిర్యాదు

YCP Vs TDP: ఏపీ లొల్లి ఢిల్లీకి.. ఇక అంతా హస్తినమే సవాల్.. ఒక్కసారిగా హైవోల్జేజ్‌