YCP Vs TDP: ఏపీ లొల్లి ఢిల్లీకి.. ఇక అంతా హస్తినమే సవాల్.. ఒక్కసారిగా హైవోల్జేజ్
ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది. ఇప్పుడు సీన్ ఢిల్లీకి మారింది! ఇక అంతా హస్తినమే సవాల్.! రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇప్పటికే ఖరారైంది.
ఒక్క మాట..! ఏపీలో క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వారం పాటు ఓ మినీ యుద్ధమే జరిగింది.! ధర్నాలు, దీక్షలు, నిరసనలు.. ఇలా రాజకీయం ఒక్కసారిగా హైవోల్జేజ్‌కి చేరింది. ఇప్పుడీ వార్ సీన్ ఢిల్లీకి షిఫ్ట్ అవుతోంది. సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు హస్తిన వెళ్లనున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నరకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తారు. టీడీపీ కార్యాలయాలపై దాడులు, డ్రగ్స్ వ్యవహారం, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, అమిత్ షా, గవర్నర్‌కు లేఖలు రాశారు . రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిలైందని.. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ. అలాగే టీడీపీ ఆఫీస్‌పై దాడిని ఘటనపై CBI విచారణ జరిపించాలని కోరుతోంది. రాష్ట్రపతికి కూడా ఇవే అంశాలపై ఫిర్యాదు చేయానున్నారు. అటు రెండు రోజుల పాటు హస్తినలోనే మకాం వేయనున్నారు చంద్రబాబు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్స్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. వీలైతే మరి కొందరు కేంద్ర పెద్దలను కలవాలని భావిస్తున్నారు.
అచ్చెన్నాయుడు, యనమల, కేశినేని నాని, పయ్యావుల కేశవ్, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, షరీఫ్, కాల్వ శ్రీనివాసులు, అనిత, రామానాయుడుతోపాటు మరికొందరు నేతలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు అండ్ టీమ్‌కు ప్రధాని, అమిత్‌షా అపాయింట్‌మెంట్ దొరుకుతుందా.. ఫిర్యాదులపై ఎలా స్పందిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Also Read: కంట్లో కనిపించిన ప్రతిబింబం ఆధారంగా ఏకంగా ఆ పాప్‌సింగర్ ఇంటికి వెళ్లి వేధించాడు