Trending: కంట్లో కనిపించిన ప్రతిబింబం ఆధారంగా ఏకంగా ఆ పాప్‌సింగర్ ఇంటికి వెళ్లి వేధించాడు

అతడిపై ఓ పాప్ సింగర్‌ని వేధించాడన్న అభియోగాలు ఉన్నాయి. దీంతో పోలీసులు అధిపులోకి తీసుకుని విచారించగా దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి.

Trending: కంట్లో కనిపించిన ప్రతిబింబం ఆధారంగా ఏకంగా ఆ పాప్‌సింగర్ ఇంటికి వెళ్లి వేధించాడు
Hibiki Sato Case
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 24, 2021 | 4:55 PM

అతడిపై ఓ పాప్ సింగర్‌ని వేధించాడన్న అభియోగాలు ఉన్నాయి. దీంతో పోలీసులు అధిపులోకి తీసుకుని విచారించగా దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. ఒక సెల్ఫీ ఫొటో ఆధారంగా అతడు ఆమె అడ్రస్‌ను కనుగొన్నాడు.  ఆమె కళ్లలో ప్రతిబింబించిన పరిసరాలను చూసి ఆమె కదలికలను తెలుసుకున్నానని చెప్పాడు. ఆమె కళ్లలో రైల్వే స్టేషన్ కనిపించిందని అతడు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఈ ఘటన 2019లో జపాన్‌లో జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

2019, సెప్టెంబరు 1 రాత్రి హిబికీ సాటో అనే యువకుడు పాప్ సింగర్‌ను ఇంటి వరకు వెంబడించి వేధింపులకు గురి చేశాడు. అతడి ప్రవర్తనతో విసిపిగిపోయిన సదరు సింగర్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. దర్యాప్తు షురూ చేసిన పోలీసులు ..సెప్టెంబర్ నెలాఖరులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం అతడు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. 21 ఏళ్ల ఆ పాప్ గాయనికి తాను బిగ్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. సామాజిక మాధ్యమాల్లో ఆమె పోస్ట్ చేసిన సెల్ఫీని జూమ్ చేయగా కళ్లలో ఒక రైల్వేస్టేషన్ కనిపించిందని.. గూగుల్ స్ట్రీట్ వ్యూ సాయంతో అదెక్కడుందో కనిపెట్టి అక్కడకు వెళ్లానని తెలిపాడు. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆమె తన అపార్ట్‌మెంట్‌లో తీసుకున్న వీడియోలను అధ్యయనం చేసి.. ఎండ దిశ, బయట నుంచి వస్తున్న కాంతి స్థాయి ఆధారంగా ఆమె ఎన్నో ఫ్లోర్‌లో నివసిస్తోందో కూడా కనిపెట్టానని చెప్పడంతో పోలీసులు ఖంగుతున్నారు.

పర్సనల్ లైఫ్ తాలుకా డీటేల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవతుతాయో చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహారణ అని అంటున్నారు పోలీసులు. ఎక్కువ క్వాలిటీ ఉన్న ఫోటోలను, వీడియోలను నిశితంగా విశ్లేషిస్తే.. చాలా సూక్ష్మ అంశాలు కూడా కనిపించే ఛాన్స్ ఉందని.. ఆపై పెరిగిన సాంకేతికతను వినియోగించుకుని లొకేషన్ తెలుసుకోవడం చాలా సులువని నిపుణులు చెబుతున్నారు. మనల్ని ట్రాక్ చేసే అవకాశం ఎదుటివారికి చేతులారా ఇచ్చినట్లు అవుతుందని పేర్కొంటున్నారు.

Also Read: Viral Video: మైకెల్ జాక్సన్ బాతుగా మళ్లీ పుట్టాడా ఏంటి

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..