Pollak Sisters: సైన్స్‌కి సవాల్.. ప్రమాదంలో మరణించిన అక్కాచెల్లెలు .. మళ్ళీ ఏడాది తర్వాత అదే తల్లికి పుట్టిన కవలలు

Pollak Sisters: సైన్స్‌కి అందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి.. వాటిల్లో ఒకరి పునర్జన్మ ఒకటి.. ఈరోజు సైన్స్ కు కనిపెట్టలేని ఓ వింత గురంచి మనం..

Pollak Sisters: సైన్స్‌కి సవాల్.. ప్రమాదంలో మరణించిన అక్కాచెల్లెలు .. మళ్ళీ ఏడాది తర్వాత అదే తల్లికి పుట్టిన కవలలు
Pollak Sisters

Pollak Sisters: సైన్స్‌కి అందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి.. వాటిల్లో ఒకరి పునర్జన్మ ఒకటి.. ఈరోజు సైన్స్ కు కనిపెట్టలేని ఓ వింత గురంచి మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే. అమెరికాకు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు మళ్లీ పుట్టారు. 1957లో ఓ కారు యాక్సిడెంట్‌లో చనిపోయిన ఇద్దరూ మళ్లీ ఏడాది తర్వాత పుట్టారు. ఇందులో మరో విశేషం ఏంటంటే గత జన్మలో ఎవరి కడుపున పుట్టారో అదే తల్లికి మళ్లీ కవలలుగా పుట్టారు. మాటలు వచ్చే వయసుకి.. ఈ కవలలు గతజన్మ సంఘటనలను పూసగుచ్చినట్లు చెప్పడంతో ఒక్కసారిగా జనాలు ఉలిక్కిపడ్డారు. పరిశోధకులు సైతం సమాధానం చెప్పలేని స్థితిలో.. ఈ పునర్జన్మ కథ ఓ మిస్టరీగా మారింది.

జొవాన్నా పొల్లాక్, జాక్వెలిన్‌ పొల్లాక్‌ అనే అమెరికన్‌ సిస్టర్స్‌.. మొదటి జన్మలో కవలలు కాదు. జాన్‌–ఫ్లోరెన్స్‌ అనే దంపతులకు 1946లో జొవాన్నా, 1951లో జాక్వెలిన్‌ జన్మించారు. జొవాన్నా కంటే జాక్వెలిన్‌ చిన్నది కావడంతో చెల్లెల్ని తల్లిలా చూసుకునేది జొవాన్నా.  అయితే జాక్వెలిన్‌ పుట్టిన ఆరేళ్లకు కారు ప్రమాదంలో  అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. అక్కకి 11 ఏళ్ళు చెల్లెలికి 6 ఏళ్ళు .

అయితే 1964లో ఫ్లోరెన్స్‌ మళ్లీ తల్లి అయ్యింది. ఇద్దరు కవలలు పుట్టారు. వారికి గిలియన్, జెన్నిఫర్‌ అని పేర్లు పెట్టారు. బుడి బుడి అడుగులతో.. బోసి మాటలతో మళ్లీ కుటుంబంలో సంతోషాలు మొదలయ్యాయి. ఒకరోజు గిల్లియన్, జెన్నిఫర్‌లు తల్లిని ‘అటకపైన దాచిన ఫలానా పాత బొమ్మలు కావాలి, అని అడగడం, వాటిని ఇవి నీవి, ఇవి నావి అంటూ పంచుకోవడం చూసి, అప్పటి దాకా చూడని ఆ బొమ్మల గురించి కవలలకు ఎలా తెలిసిందబ్బా అనుకుంది ఫ్లోరెన్స్‌. మూడేళ్ల వయసున్న ఆ చిన్నారులు చనిపోయిన ఇద్దరు పిల్లల ఫోటోని చూసి ఇది నువ్వు, ఇది నేను అంటూ గుర్తుపట్టారు. ఇదంతా కళ్లారా చూసిన తల్లి షాక్‌ అయింది. మరో రోజు కవలలతో బయటికి వెళ్లిన జాన్‌ దంపతులకు ఇంకో షాక్‌ ఎదురైంది.

గతంలో జొవాన్నా, జాక్వెలిన్‌లు చదివిన స్కూల్‌ని, యాక్సిడెంట్‌ అయిన ప్లేస్‌ని గుర్తుపట్టారు పిల్లలు. అయితే అప్పటిదాకా కవలలు ఆ ప్లేస్‌ని ఎప్పుడూ చూడలేదు. ఇక రోడ్డుపై కవలలు వెళ్తున్నప్పుడు కారు కనిపిస్తే చాలు..తమవైపే దూసుకొస్తుందని ఏడ్చేవారట. ఇలా ఐదారేళ్లు వచ్చేదాకా అచ్చం జొవాన్నా, జాక్వెలిన్‌లానే ప్రవర్తించేవారు కవలలు. దాంతో షాకుల మీద షాకులు తిన్న తల్లిదండ్రులకు.. ఓ క్లారిటీ వచ్చింది. చనిపోయిన తమ పిల్లలే గిల్లియన్, జెన్నిఫర్‌లా పుట్టారని నమ్మడం మొదలుపెట్టారు. తమకు కలిగిన అనుభవాలను అందరితో పంచుకోవడం ఆరంభించారు. ఏడేళ్ల వయసు వచ్చేసరికి.. గత జన్మ స్మృతులని పూర్తిగా మరిచిపోయారు ఆ కవలలు. సాధారణ పిల్లల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దాంతో సమస్య తీరింది. కానీ అదెలా సాధ్యం అనేది మాత్రం నేటికీ అంతుచిక్కలేదు. అయితే ఈ పొల్లాక్‌ సిస్టర్స్‌ పునర్జన్మ ఓ కట్టుకథ అని కొట్టిపారేసేవాళ్లూ లేకపోలేదు.

అమెరికన్‌ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ ఇయాన్‌ స్టీవెన్సన్‌.. పునర్జన్మలు, గత జన్మ జ్ఞాపకాలపై పలు పరిశోధనలు చేశారు. వేల కేసుల్ని స్టడీ చేశారు. 1987లో ఇలాంటి 14 ఆసక్తికర సంఘటనలతో ‘చిల్డ్రన్స్‌ హూ రిమెంబర్‌ దెయిర్‌ పాస్ట్‌ లైవ్స్‌ పేరుతో పుస్తకం కూడా రాశారు. కచ్చితంగా పునర్జన్మలు ఉన్నాయని, అందులో పొల్లాక్‌ సిస్టర్స్‌ కథ కూడా వాస్తవమేనని వెల్లడించారు. సాధారణంగా అమెరికన్లకు ఏలియన్స్, టైమ్‌ ట్రావెల్స్‌తో పాటు ఆత్మలన్నా, దెయ్యాలన్నా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. పైగా చనిపోయిన వారిలో 24 శాతం మంది మళ్లీ తిరిగి పుడతారని వారు బలంగా నమ్ముతారు.

Also Read:   ఆ ఊళ్లో ఇళ్లు కట్టుకోడానికి భూమి ఫ్రీ.. జనాభాను పెంచడానికి ప్రభుత్వం ఆఫర్‌

Click on your DTH Provider to Add TV9 Telugu