Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సరదాకి సముద్రంలో వల వేశాడు.. దెబ్బకి షాక్‌ తిన్న డాక్టర్‌..! జీవితంలో పట్టుకున్న అతి పెద్ద.. (వీడియో)

Viral Video: సరదాకి సముద్రంలో వల వేశాడు.. దెబ్బకి షాక్‌ తిన్న డాక్టర్‌..! జీవితంలో పట్టుకున్న అతి పెద్ద.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 25, 2021 | 8:38 AM

అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి సరదాకి సముద్రంలో వల వేశాడు. దానికి చిక్కుకున్న షార్క్‌ చేపని చూసి షాక్‌ అయ్యాడు. దానిని ఒడ్డుకు తీసుకురావడం అతడి వల్ల కాలేదు. ఇతరుల సహాయం తీసుకోవలసి వచ్చింది. ఈ సంఘటన అమెరికాలోని నార్త్ కరోలినా తీరంలో జరిగింది.

అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి సరదాకి సముద్రంలో వల వేశాడు. దానికి చిక్కుకున్న షార్క్‌ చేపని చూసి షాక్‌ అయ్యాడు. దానిని ఒడ్డుకు తీసుకురావడం అతడి వల్ల కాలేదు. ఇతరుల సహాయం తీసుకోవలసి వచ్చింది. ఈ సంఘటన అమెరికాలోని నార్త్ కరోలినా తీరంలో జరిగింది. బ్లేక్ కోక్రాన్ అనే వ్యక్తి వృత్తిరీత్యా డాక్టర్. కానీ అతడికి చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. అందుకోసం ఉత్తర కరోలినా తీరంలో ఉన్న సముద్రంలో నెట్ విసిరి చాలా సేపు వేచి చూసాడు. కొంతసేపటికి నెట్‌ కదలడం మొదలైంది. వెంటనే వెళ్లి దానిని లాగడానికి ప్రయత్నించాడు. కానీ అతడి వల్ల కాలేదు. నెట్‌చాలా బరువుగా ఉండటంతో అక్కడున్న స్థానికులను పిలిచి వలను మొత్తానికి ఒడ్డుకు తెచ్చాడు. అందులో ఒక కారు సైజంతా హామర్‌హెడ్ సొరచేప చిక్కుకుంది. దానిని చూసి అక్కడున్న జనంతో పాటు బ్లేక్ కూడా ఆశ్చర్యపోయాడు. కానీ ఆ షార్క్‌ను చూసి ​జాలి కలిగిన బ్లేక్ తిరిగి సముద్రంలోకి వదిలేశాడు. కారు సైజులో ఉన్న ఆ సొర చేపతో కలిసి అందరూ ఫోటోలు దిగారు. ఇది తన జీవితంలో పట్టుకున్న అతి పెద్ద చేప అని బ్లేక్‌ సంతోషంతో చెప్పారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)