Free Land for House: ఆ ఊళ్లో ఇళ్లు కట్టుకోడానికి భూమి ఫ్రీ.. జనాభాను పెంచడానికి ప్రభుత్వం ఆఫర్
Free Land for House: కొన్ని దేశాల్లో జనాభా రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతుంది.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు పెరగడం..
Free Land for House: కొన్ని దేశాల్లో జనాభా రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతుంది.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు పెరగడం లేదు అన్నది అందరికీ తెలిసిన సత్యం. అయితే కొన్ని దేశాల్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. తమ దేశంలో రోజు రోజుకీ జనాభా తగ్గుతుంది.. పిల్లలల్ని కనమని ఓ వైపు.. జనాభాను పెంచడానికి ప్రభుత్వం నానా కష్టాలు పడుతున్నాయి. తమ దేశ జనాభా పెంచడానికి వివిధ మార్గాల్లో ప్రజలను ప్రోత్సహిస్తుంటాయి. ఇటీవల ఆస్ట్రేలియాలోని క్విల్పీ నగరంలో ఒక ప్రత్యేక కేసు బయటపడింది. ఇక్కడ జనాభాను పెంచడం అధికారులకు ఒక సవాలుగా మారింది. ఎందుకంటే ఇక్కడ జనాభా చాలా తక్కువ. గణాంకాల ప్రకారం అక్కడి జనాభా 800 మంది మాత్రమే. ఈ క్రమంలో జనాభాను పెంచడానికి అధికార యంత్రాంగం అక్కడి ప్రజలకు ఉచిత భూమి ఆఫర్ ప్రకటించింది.
జనాభా కొరత కారణంగా పశుపోషణ, గొర్రెల పెంపకానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేయడంలో అక్కడి ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అయితే బ్రిటన్, ఇండియా, హాంకాంగ్, న్యూజిలాండ్ ప్రజలు వలస వెళ్లడంద్వారా ఉచిత భూమిని పొందడం గురించి ఆరా తీశారు. అయితే అక్కడ భూమి ఉచితంగా తీసుకోవాలంటే ఆస్ట్రేలియా పౌరులు లేదా శాశ్వత నివాసితులుగా ఉన్న వ్యక్తులు మాత్రమే అర్హులుగా పరిగణిస్తున్నారు.
Also Read: చెవికి ఇన్ఫెక్షన్ అని ఆస్పత్రికి వెళ్ళిన యువతికి షాక్.. చెవిలో గూడు కట్టిన సాలీడు..