RBI: టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్‌కు రూ.2.54 కోట్ల జరిమానా విధించిన ఆర్బీఐ..
నిబంధనలను పాటించనందుకు టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్, అప్‌నిట్ టెక్నాలజీస్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జరిమానా విధించింది. టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్‌పై ₹ 2 కోట్లు, అప్‌నిట్‌పై ₹ 54.93 లక్షల పెనాల్టీ విధించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది...
నిబంధనలను పాటించనందుకు టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్, అప్‌నిట్ టెక్నాలజీస్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జరిమానా విధించింది. టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్‌పై ₹ 2 కోట్లు, అప్‌నిట్‌పై ₹ 54.93 లక్షల పెనాల్టీ విధించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ.
టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ వైట్ లేబుల్ ATM డిప్లాయ్‌మెంట్, నికర-విలువ ఆవశ్యకతపై RBI జారీ చేసిన ఆదేశాలను పాటించడం లేదని తేలింది. దీంతో వివరణ ఇవ్వాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ” వ్యక్తిగత విచారణ సమయంలో వారి రాతపూర్వక సమాధానం తీసుకున్న తర్వాత ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం ముంబైలో ఉన్న అప్నా సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్బీఐ రూ.79 లక్షల జరిమానా విధించింది. అలాగే మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఉన్న సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ కేవైసీ నిబంధనలు పాటించనందున రూ.2 లక్షల జరిమానా విధించింది.
అయితే బ్యాంకులకు జరిమానా విధించడం వల్ల కస్టమర్ల పెట్టుబడులపై ఎలాంటి ప్రభావితం చేయదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆదాయం, ప్రొవిజనింగ్, ఇతర సంబంధిత విషయాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు, డిపాజిట్ ఖాతాల నిర్వహణపై ఆర్బీఐ ఆదేశాలు పాటించనందున ఆర్బీఐ ఈ జరిమానా విధించింది.
Read Also.. Digital Banks: దేశంలో డిజిటల్ బ్యాంకులు.. ప్రతిపాదించిన నీతి ఆయోగ్..