RBI: బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా.. నిబంధనలు పాటించని 8 బ్యాంకులపై జరిమానా విధింపు..!

RBI: నిబంధనలు పాటించని బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) కొరఢా ఝులిపిస్తోంది. బ్యాంకులకు భారీ ఎత్తున జరిమానాలు విధిస్తోంది...

RBI: బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా.. నిబంధనలు పాటించని 8 బ్యాంకులపై జరిమానా విధింపు..!
Reserve Bank of India
Follow us
Subhash Goud

|

Updated on: Mar 15, 2022 | 1:27 PM

RBI: నిబంధనలు పాటించని బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) కొరఢా ఝులిపిస్తోంది. బ్యాంకులకు భారీ ఎత్తున జరిమానాలు విధిస్తోంది. ఇక మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మణిపూర్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలోని ఎనిమిది సహకార బ్యాంకుల (Co-Operative Banks)పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ. 12 లక్షలకు పైగా జరిమానా విధించింది. ప్రుడెన్షియల్ ఇంటర్-బ్యాంక్ ఎక్స్‌పోజర్ పరిమితిని పాటించనందుకు, ప్రుడెన్షియల్ ఇంటర్-బ్యాంక్ కౌంటర్‌పార్టీ పరిమితిని పాటించడంలో విఫలమైనందుకు పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌లోని నాబాపల్లి కోఆపరేటివ్ బ్యాంక్‌పై RBI అత్యధికంగా రూ. 4 లక్షల జరిమానా విధించింది.

అలాగే మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఫైజ్ మెర్కెంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించి డైరెక్టర్ బంధువుకు రుణం మంజూరు చేసినందుకు రూ. 25,000 జరిమానా విధించింది ఆర్బీఐ. జరిమానా విధించిన ఇతర బ్యాంకుల్లో మధ్యప్రదేశ్‌లోని జిలా సహకరి కేంద్రీయ బ్యాంక్ మర్యాడిట్, మహారాష్ట్రలోని అమరావతి మర్చంట్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్, మణిపూర్‌లోని మణిపూర్ ఉమెన్స్ కోఆపరేటివ్ బ్యాంక్, ఉత్తరప్రదేశ్‌లోని యునైటెడ్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్, బాఘత్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉన్నాయి. హర్యానా, గుజరాత్‌లోని నవనిర్మాణ్ కో-ఆపరేటివ్ బ్యాంక్. ఈ బ్యాంకులపై రూ.లక్ష జరిమానా విధించారు. ఈ బ్యాంకులు చేసిన కొన్ని ఉల్లంఘనలలో అర్హత లేని డిపాజిట్‌లను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కి బదిలీ చేయకపోవడం, మోసాలను నివేదించడంలో జాప్యం, అసురక్షిత రుణాలను మంజూరు చేయడం వంటివి ఉన్నాయి. ఇలా నిబంధనలు పాటించని బ్యాంకులపై జరిమానాలు విధిస్తో వస్తోంది ఆర్బీఐ.

ఇవి కూడా చదవండి:

Interest Rate: వాటి వడ్డీ రేట్ల విషయంలో RBI కీలక నిర్ణయం.. రుణగ్రహీతలకు ఆ వివరాలు తెలపాల్సిందేనని ఆదేశం..

IndusInd Bank FD: ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశారా..? వడ్డీ రేట్లలో మార్పు