Interest Rate: వాటి వడ్డీ రేట్ల విషయంలో RBI కీలక నిర్ణయం.. రుణగ్రహీతలకు ఆ వివరాలు తెలపాల్సిందేనని ఆదేశం..
Interest Rate: ఇకపై వాటి వడ్డీ రేట్ల విషయంలో రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. రుణగ్రహీతలకు ఇకపై ఆ వివరాలు తప్పనిసరిగా తెలియజేయాల్సిందేనని మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆదేశించింది.
Interest Rate: ఇకపై వడ్డీ రేట్లు తామే నిర్ణయించుకునేందుకు రిజర్వు బ్యాంకు మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు(Micro Finance Companies) సోమవారం నుంచి వెసులుబాటు కల్పించింది. గతంలో ఈ వడ్డీ రేట్లను ఆర్బీఐ(RBI) త్రైమాసికానికి ఒకసారి నిర్ణయించేది. సాధారణంగా ఎటువంటి హీమీలు లేకుండా ఫైనాన్స్ కంపెనీలు ఈ రుణాలను అందిస్తుంటాయి. సంవత్సరానికి రూ. 3 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి వీటిని అందిస్తుంటారు. రుణాలు తీసుకునే వారికి లోన్ కింద విధించి ఛార్జీలు, ఫీజులు వడ్డీ వ్యాపారం లాగా ఉండకూడదని వెల్లడించింది. వాటిపై రిజర్వు బ్యాంకు పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. రుణగ్రహీతకు ఫైనాన్స్ సంస్థ విధించే వివిధ ఛార్జీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక ఫ్యాక్ట్ షీట్ రూపంలో అందించాలని రిజర్వు బ్యాంక్ తెలిపింది. ఎటువంటి రుసుములు వసూలు చేసినా వాటి వివరాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.
మైక్రో ఫైనాన్స్ లోన్ల విషయంలో లోన్ మెుత్తం ముందుగా చెల్లించటంపై ప్రీ క్లోజర్ పెనాల్టీలు విధించరాదని ఆర్బీఐ తెలిపింది. లేటు చెల్లింపులు చేసినప్పుడు కేవలం ఆ ఈఎంఐ కు మాత్రమే అపరాద రుసుము విధించాలని.. మెుత్తం అప్పుకు కాదని తెలిపింది. నెలవారీ ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ లోన్ చెల్లింపులకు వెళ్లకుండా ఉండే విధంగా లోన్ ఇవ్వాలని తెలిపింది. అంతే కాక లోన్ ఎగ్రిమెంట్ రుణగ్రహీతకు అర్థమయ్యే అక్కడి ప్రాంతీయ భాషలోనూ ఉండాలని తెలిపింది. ఎన్బీఎఫ్సీ కంపెనీ మెుత్తం ఆస్తిలో 25 శాతాన్ని రుణాలుగా ఇవ్వవచ్చని తెలిపింది. దీనిపై మార్కెట్ వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రిస్క్ కు అనుగుణంగా వడ్డీ రేట్లు పెట్టుకునేందుకు వెసులుబాటు, రూ. 3 లక్షలకు లోన్ లిమిట్ పెంచటం మంచి వ్యాపార అవకాశాలను అందిస్తుందని వారు అంటున్నారు.
ఇవీ చదవండి..
Market News: స్పల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ఊగిసలాటల్లో కొనసాగుతున్న సూచీలు..
Elon Musk Vs Putin: రష్యా అధ్యక్షుడికి ఎలాన్ మస్క్ ఛాలెంజ్.. ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు..