AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IndusInd Bank FD: ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశారా..? వడ్డీ రేట్లలో మార్పు

IndusInd Bank FD: ప్రైవేట్ రంగ ఇండస్‌ఇండ్ బ్యాంక్ హోలీకి ముందు కస్టమర్‌లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను బ్యాంక్ మార్చింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ లేదా..

IndusInd Bank FD: ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశారా..? వడ్డీ రేట్లలో మార్పు
Subhash Goud
|

Updated on: Mar 15, 2022 | 10:49 AM

Share

IndusInd Bank FD: ప్రైవేట్ రంగ ఇండస్‌ఇండ్ బ్యాంక్ హోలీకి ముందు కస్టమర్‌లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను బ్యాంక్ మార్చింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ లేదా సమానమైన విత్‌డ్రా, నాన్-విత్‌డ్రావల్ కేటగిరీల కోసం బ్యాంక్ FD రేట్లను సవరించింది. ఇప్పటి వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు బల్క్ డిపాజిట్లపై తమ FD రేట్లను తగ్గించాయి. IndusInd కొత్త రేట్లు మార్చి 14, 2022 నుండి అమలులోకి వచ్చాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 61 నెలల కంటే ఎక్కువ,10 సంవత్సరాల వరకు 10 కోట్ల రూపాయల నుండి 100 కోట్ల రూపాయల మధ్య డిపాజిట్లపై 4.9 శాతం వడ్డీని అందిస్తోంది. అదే కాలంలో రూ. 5 కోట్ల నుంచి రూ. 5.5 కోట్ల వరకు, రూ. 5.75 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్య డిపాజిట్లపై 4.8 శాతం వడ్డీని అందిస్తోంది.

అదే సమయంలో బ్యాంక్ 1 సంవత్సరం నుండి 10 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 5.50 కోట్ల నుండి రూ. 5.75 కోట్ల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.25 శాతం వడ్డీని ఇస్తోంది. ఇది కాకుండా 7 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధికి వడ్డీ రేటు 3.1-3.5 శాతంగా ఉంటుంది. అయితే ఇతర కాలపరిమితి, ఇతర డిపాజిట్ల కోసం బ్యాంక్ అందించే FD వడ్డీ రేట్లతో పోలిస్తే ఈ డిపాజిట్ల విలువ రేట్లు తక్కువగా ఉంటాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 1 సంవత్సరం కంటే ఎక్కువ, 61 నెలల కంటే తక్కువ డిపాజిట్లపై 4.7 శాతం నుండి 4.85 శాతం వరకు ఉంటాయి. ఇదిలా ఉండగా, 7 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో ఉన్న వాటికి వడ్డీ రేట్లు 3.1 శాతం నుండి 4.75 శాతం వరకు ఉన్నాయి. అయితే రూ. 5 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు నాన్-విత్‌డ్రావల్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు, వడ్డీ రేటు 3.1 శాతం నుండి గరిష్టంగా 5 శాతం వరకు ఉంటుంది.

ముందస్తు ఉపసంహరణపై వడ్డీ ఉండదు

దేశీయ, NRO టర్మ్ డిపాజిట్‌లకు ముందస్తు ఉపసంహరణకు కనీస వ్యవధి 7 రోజులు, డిపాజిట్ తేదీ నుండి 7 రోజులలోపు ముందస్తు ఉపసంహరణలకు వడ్డీ చెల్లించబడదని గమనించండి. ఇదిలా ఉండగా NRE టర్మ్ డిపాజిట్‌లకు కనీస కాలవ్యవధి 1 సంవత్సరం, అలాగే ఈ వ్యవధిలోపు ముందస్తు ఉపసంహరణలపై వడ్డీ చెల్లించబడదు. అదనంగా ముందస్తు ఉపసంహరణపై 1 శాతం వరకు జరిమానా వడ్డీ విధించబడుతుంది. అదే సమయంలో, నాన్-విత్‌డ్రావల్ టర్మ్ కింద ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ముందస్తు ఉపసంహరణ సదుపాయం ఉండదు. అంటే అటువంటి డిపాజిట్ వ్యవధి ముగిసేలోపు డిపాజిటర్ FDని మూసివేయలేరు.

ఇవి కూడా చదవండి:

Indian Railway: రైలు డ్రైవర్‌కు ముందుగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు..? విఫలమైతే ట్రైన్‌ నడిపేందుకు అనుమతి ఉండదు

Karnataka: కంచె చేను మేయడమంటే ఇదే.. బ్యాంకుకు కన్నమేసిన క్యాషియర్‌.. స్నేహితులతో కలిసి ఏకంగా..