Airlines Aerobridges: విమాన సంస్థలు డబ్బు ఆదా కోసం ఏరోబ్రిడ్జ్‌లను ఉపయోగించడం లేదు: పార్లమెంట్‌ కమిటీ

Airlines Aerobridges: భారతదేశంలోని ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ డబ్బు ఆదా చేయడానికి విమానంలో ఎక్కడానికి, డీ-బోర్డింగ్‌ చేయడానికి ఏరో బ్రిడ్జ్‌లను ఉపయోగించకూడదని..

Airlines Aerobridges: విమాన సంస్థలు డబ్బు ఆదా కోసం ఏరోబ్రిడ్జ్‌లను ఉపయోగించడం లేదు: పార్లమెంట్‌ కమిటీ
Follow us
Subhash Goud

|

Updated on: Mar 15, 2022 | 10:01 AM

Airlines Aerobridges: భారతదేశంలోని ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ డబ్బు ఆదా చేయడానికి విమానంలో ఎక్కడానికి, డీ-బోర్డింగ్‌ చేయడానికి ఏరో బ్రిడ్జ్‌లను ఉపయోగించకూడదని నిర్ణయించుకుంటున్నాయని, దీని వల్ల వృద్ధులు మెట్లను ఉపయోగించాల్సి అవసరం ఉందని పార్లమెంటరీ కమిటీ సోమవారం తెలిపింది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ అటువంటి క్యారియర్‌లకు జరిమానా జరిమానా విధించాలని పేర్కొంటూ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ వైఖరిని ఖండించినట్లు నివేదిక పేర్కొంది.

ఏరోబ్రిడ్జ్‌ అంటే ఏమిటి?

ఏరోబ్రిడ్జ్‌ అనేది ప్రయాణికులు విమానాల్లో ఎక్కేందుకు సులభంగా ఉంటుంది. ఏరోబ్రిడ్జ్‌పై వృద్దులు నిలబడితే కదలకుండా విమానంలోకి తీసుకెళ్తుంది. అయితే ఎయిర్‌లైన్స్‌ ఏరోబ్రిడ్జ్‌ సౌకర్యాలను ఉపయోగించడానికి విమానాశ్రయానికి కొంత ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుంది. రవాణా, పర్యాటకం, సంస్కృతికి సంబంధించి పార్లమెంటరీ కమిటీ నివేదికను సోమవారం రాజ్యసభలో సమర్పించింది. అందులో కొన్ని విమానాశ్రయాలలో ఏరోబ్రిడ్జ్‌లు ఉన్నప్పటికీ విమానయాన సంస్థలు ప్రయాణికులు ఎక్కడానికి, దిగడానికి వాటిని ఉపయోగించడం లేదని, వాటికి బదులుగా మెట్లను ఉపయోగిస్తున్నారని కమిటీ తెలిపింది. అయితే ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ, ప్రైవేటు విమానయాన సంస్థలు ఏరోబ్రిడ్జ్‌ సౌకర్యాలను ఉపయోగించడం లేదని పేర్కొంది. దీని కారణంగా ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, విమానం ఎక్కేందుకు పార్కింగ్‌ స్టాండ్‌ మెట్లను ఎక్కుతూ ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపింది.

కాగా, పౌర విమానయాన మంత్రిత్వశాఖ 2018లో అన్ని భారతీయ విమానాశ్రయ ఆపరేటర్లకు ఒక సర్క్యూలర్‌ జారీ చేసింది. ప్రయాణికులు ఎక్కేందుకు, డీబోర్డింగ్‌ చేయడానికి ఏరోబ్రిడ్జ్‌ అందుబాటులో ఉంటే దానిని వారి సౌలభ్యం కోసం ఉపయోగించాలని పేర్కొంది. అయితే మంత్రిత్వశాఖ ఉత్తర్వుల ప్రకారం క్రమం తప్పకుండా విమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించాలని, ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌కు జరిమానా విధించాలని కమిటీ సోమవారం సిఫార్స్‌ చేసింది.

ఇవి కూడా చదవండి:

Petrol Diesel Price: ప్రపంచ దేశలపై చమురు ధరల ప్రభావం.. మన దేశంలో మాత్రం నిలకడగానే పెట్రోల్, డీజిల్ ధరలు

Paytm Payments Bank: డేటా మొత్తం భద్రంగానే ఉంది.. ఆర్బీఐ నిబంధనలు పాటిస్తున్నాం: పేటీఎం