- Telugu News Photo Gallery Business photos Paytm Payments Bank Denies Report Claiming Data Leak To China, Says Fully Compliant With RBI Rules
Paytm Payments Bank: డేటా మొత్తం భద్రంగానే ఉంది.. ఆర్బీఐ నిబంధనలు పాటిస్తున్నాం: పేటీఎం
Paytm Payments Bank: డేటా స్థానికతకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ధేశించిన నిబంధనలు పూర్తిగా పాటిస్తున్నామని పేటీఎం (Paytm) పేమెంట్స్ బ్యాంక్ (PPBL)..
Updated on: Mar 15, 2022 | 7:50 AM

Paytm Payments Bank: డేటా స్థానికతకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ధేశించిన నిబంధనలు పూర్తిగా పాటిస్తున్నామని పేటీఎం (Paytm) పేమెంట్స్ బ్యాంక్ (PPBL) స్పష్టం చేసింది. తమ బ్యాంకు డేటా అంతా దేశీయంగానే నిబంధనలకు అనుగుణంగా భద్రపరుస్తున్నామని తెలిపింది.

ఈనెల 11న రిజర్వ్ బ్యాంకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై నిషేధం విధించింది. కొత్త కస్టమర్లను రాకుండా నిషేధించింది ఆర్బీఐ. అయితే ఆర్బీఐ నియమాలకు తాము కట్టుబడి ఉన్నాయని పేటీఎం తెలిపింది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్, 1949లోని సెక్షన్ 35A కింద ఆర్బీఐ తన అధికారాల మేరకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్‌ని కొత్త వినియోగదారులను ఆన్‌బోర్డు చేయకుండా తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సర్వర్లలోని వివరాలు చైనా కంపెనీలకు వెళ్తున్నాయనే వార్తలు రావడంతో సోమవారం పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేరు ఒక్కసారిగా పతనమైంది.





























