Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: రైలు డ్రైవర్‌కు ముందుగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు..? విఫలమైతే ట్రైన్‌ నడిపేందుకు అనుమతి ఉండదు

Indian Railway: భారతదేశంలో అతిపెద్దది రైల్వే సంస్థ. రైళ్లు ప్రతి రోజు లక్షలాది మందిని వివిధ గమ్యస్థానాలకు చేర్చుస్తాయి. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేది రైలు..

Indian Railway: రైలు డ్రైవర్‌కు ముందుగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు..? విఫలమైతే ట్రైన్‌ నడిపేందుకు అనుమతి ఉండదు
Railway Loco Pilot
Follow us
Subhash Goud

|

Updated on: Mar 15, 2022 | 10:26 AM

Indian Railway: భారతదేశంలో అతిపెద్దది రైల్వే సంస్థ. రైళ్లు ప్రతి రోజు లక్షలాది మందిని వివిధ గమ్యస్థానాలకు చేర్చుస్తాయి. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేది రైలు ప్రయాణం. టికెట్‌ ధర సైతం తక్కువగా ఉండటంతో సామాన్యుడు కూడా రైలు ప్రయాణం చేసేందుకు వీలుంటుంది. ఇక ప్రయాణికులను వారివారి గమ్యస్థానానికి చేర్చడంలో ఒక వ్యక్తి ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు. అతనే రైలు లోకో పైలట్ (Loco Polot). లోకో పైలట్లు కొన్ని వందలాది కిలోమీటర్ల దూరం రైలును నడుపుతుంటారు. కానీ రైలులో లోకో పైలట్ పని ఏమిటో తెలుసా? ప్రతిసారీ డ్యూటీకి వచ్చే ముందు కొన్ని పరీక్షలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే అతను రైలు (Train)లో కూర్చుంటాడు. లేకపోతే రైలు నడిపేందుకు అనుమతి ఉండదు. ముందుగా లోకో పైలట్ తన హాజరు నమోదు చేసుకోవాలి. తర్వాత రైలుకు సంబంధించిన సమాచారాన్ని అతనికి ఇస్తారు రైల్వే అధికారులు. అంతే కాకుండా వారికి రైలు రూట్ మ్యాప్ తదితర పూర్తి సమాచారం అందించి రైలుకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తారు.

దీని తరువాత పైలట్‌కు ఆల్కహాల్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష తర్వాత మద్యం సేవించనట్లు పరీక్షలో తేలితే లోకో పైలట్ రైలు ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి అనుమతిస్తారు. రైలును నడపడమే కాకుండా చాలా పనులు ఉన్నాయి. రైలును నడపడానికి ముందు, లోకో పైలట్ రైలు ఇంజిన్‌ను తనిఖీ చేయాలి. ఇంజిన్‌లో ఏదైనా లోపం ఉందా అని అతను ఇంజిన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇంజన్‌ను పూర్తి స్థాయిలో తనిఖీ చేసుకుని సరిగ్గా ఉందని గుర్తించిన తర్వాతే రైలును స్టార్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లోకో పైలట్‌ రైలు నడిపే ముందు అన్నింటిని తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. లోకో పైలట్‌కు నిర్వహించే పరీక్షలో అన్ని సరిగ్గా ఉంటే రైలు నడిపేందుకు అనుమతి ఇస్తారు రైల్వే అధికారులు.

ఇవి కూడా చదవండి:

Airlines Aerobridges: విమాన సంస్థలు డబ్బు ఆదా కోసం ఏరోబ్రిడ్జ్‌లను ఉపయోగించడం లేదు: పార్లమెంట్‌ కమిటీ

Paytm Payments Bank: డేటా మొత్తం భద్రంగానే ఉంది.. ఆర్బీఐ నిబంధనలు పాటిస్తున్నాం: పేటీఎం