AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Alert: గుడ్ న్యూస్.. ఫిక్స్ డిపాడిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఇండియన్ బ్యాంక్.. ఎంతంటే..

Bank Alert: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ ఫిక్స్ డిపాడిట్ వడ్డీ రేట్లలో మార్చింది. వడ్డీ రేట్ల మార్పుకు సంబంధించిన వివరాలను బ్యాంక్ జూన్ 1న వెలువరించింది.

Bank Alert: గుడ్ న్యూస్.. ఫిక్స్ డిపాడిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఇండియన్ బ్యాంక్.. ఎంతంటే..
Indian Bank
Ayyappa Mamidi
|

Updated on: Jun 02, 2022 | 3:17 PM

Share

ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ ఫిక్స్ డిపాడిట్ వడ్డీ రేట్లలో మార్చింది. బ్యాంక్ అందించిన వివరాల ప్రకారం.. రూ.2 కోట్ల కంటే తక్కువ దేశీయ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రేట్ల మార్పును బ్యాంక్ జూన్ 1, 2022న ప్రకటించింది. వడ్డీ రేట్లలో మార్పు కారణంగా బ్యాంక్ వివిధ కాలపరిమితితో ఉండే డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచింది. 7 రోజుల నుంచి 5 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై 2.80 శాతం నుంచి 5.35 శాతం మధ్యలో వడ్డీ రేట్లను సవరించింది.

బ్యాంకు 7 నుంచి 29 రోజుల పాటు ఉంచే డిపాజిట్లపై 2.80 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తోంది. అయితే 30 నుంచి 45 రోజుల పాటు నిర్వహించే డిపాజిట్లపై వడ్డీ రేటు 2.80 శాతం నుంచి 3.00 శాతానికి అంటే 20 బేసిస్ పాయింట్లను పెంచింది. 46 రోజుల నుంచి 90 రోజుల మెచ్యూరిటీ వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ 3.25 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తుండగా.. 91 నుంచి 120 రోజుల మెచ్యూరిటీ వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 3.35 శాతం నుంచి 3.50కి పెంచింది. 121 రోజుల నుంచి 180 రోజుల టర్మ్ డిపాజిట్లపై.. ఇండియన్ బ్యాంక్ ఇప్పుడు 3.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇది గతంలో 3.50 శాతంగా ఉండేది అంటే 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు పెరిగింది.

181 రోజుల నుంచి 9 నెలల కంటే తక్కువ, 9 నెలల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంక్ 4.00 శాతం మరియు 4.40 శాతం వడ్డీ రేట్లను అందించడం కొనసాగిస్తోంది. ఒక సంవత్సరం టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.00 శాతం నుంచి 5.10 శాతానికి అంటే 10 బేసిస్ పాయింట్ల పెరిగింది. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కానీ.. రెండేళ్లలోపు డిపాజిట్లపై.. వడ్డీ రేటు 5.05 శాతం నుంచి 5.20 శాతానికి  అంటే 15 బేసిస్ పాయింట్లు పెంచింది. రెండేళ్ల పైన మూడేళ్లలోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.10 శాతం నుంచి 5.25 శాతానికి పెంచబడింది.

3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 5.20 శాతం నుంచి 5.35 శాతానికి పెరిగింది. 5 సంవత్సరాల డిపాజిట్లపై వడ్డీ రేటు 5.25 శాతం నుంచి 5.35 శాతానికి పెరిగింది. 5 సంవత్సరాల కంటే ఎక్కువ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.15 శాతం నుంచి 5.35 శాతానికి బ్యాంక్ పెంచింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు.. రేవంత్ సర్కార్ కొత్త స్కీమ్
రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు.. రేవంత్ సర్కార్ కొత్త స్కీమ్
మేడం సార్ మేడం అంతే.. త్రిష మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా..?
మేడం సార్ మేడం అంతే.. త్రిష మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా..?
అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత
అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత
ఓరీ దేవుడో.. ఇంత చిన్న చీమలో అంత పవర్ ఉంటుందా? ఈ నిజాలు తెలిస్తే
ఓరీ దేవుడో.. ఇంత చిన్న చీమలో అంత పవర్ ఉంటుందా? ఈ నిజాలు తెలిస్తే
వరుసగా 4 రోజుల పాటు ఎస్బీఐ బ్యాంక్‌లు బంద్
వరుసగా 4 రోజుల పాటు ఎస్బీఐ బ్యాంక్‌లు బంద్
చదువుల తల్లిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో..
చదువుల తల్లిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో..
వేడిని తరిమికొట్టే మజ్జిగలో ఈ పొడి వేసుకుని తాగారంటే..
వేడిని తరిమికొట్టే మజ్జిగలో ఈ పొడి వేసుకుని తాగారంటే..
నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ధర్మేంద్ర ప్రధాన్
నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ధర్మేంద్ర ప్రధాన్
అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకు..మొదటి రాత్రి భార్యను చూసి పరార్
అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకు..మొదటి రాత్రి భార్యను చూసి పరార్
చంద్రుడి కటాక్షం.. ఈ రాశులకు ధన ధాన్య యోగం ఖాయం!
చంద్రుడి కటాక్షం.. ఈ రాశులకు ధన ధాన్య యోగం ఖాయం!