కోవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్సకు ఖర్చులు పెరిగిపోతున్నాయా…! రుణం ఇస్తామంటున్న బ్యాంకులు..
Loan for Covid-19 Treatment: కరోనాతో ఆస్పత్రిలో చేరారా.. ఖర్చులు పెరిగిపోయాయా.. అయితే ఈ బ్యాంకులు అత్యంత తక్కువ వడ్డీతో రుణం అందిస్తున్నాయి..
Covid Personal Loan: కోవిడ్ ప్రభావం కొద్దిగా ఉంటే ఇంట్లోనే చికిత్స సరిపోతుంది. కానీ, ఏదైనా తేడా వచ్చినప్పుడు మాత్రం ఆసుపత్రిలో వెంటనే చారాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలో చికిత్సకు రూ.లక్షల్లోనే ఖర్చవుతోన్న సంగతి మనందరికి తెలుసు.. అప్పుడు మన వెంటనే ఉండే హెల్త్ పాలసీని మించి చికిత్స ఖర్చు అప్పుడు డబ్బు అవసరం అవుతుంది. అప్పుడు ఇరుగు.. పొరుగువారి వద్ద అప్పులు తప్పడం మరింత కష్టాల్లోకి కూరుకునే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేమున్నామంటున్నాయి ప్రభుత్వ బ్యాంకులు.
ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన తమ ఖాతాదారులకు రుణాలందించేందుకు పలు బ్యాంకులు ప్రత్యేక పథకాలను తీసుకొచ్చాయి. సాధారణ పర్సనల్ లోన్ తీసుకుంటే 12-15 శాతం వరకూ వడ్డీ ఉంటుంది. కానీ, ఈ ప్రత్యేక రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. ఎస్‌బీఐ(SBI), యూబీఐ(UBI) వంటి బ్యాంకులు కేవలం 8.5శాతం వడ్డీకి కోవిడ్ పర్సనల్ లోన్స్ పేరుతో రుణాలను అందిస్తున్నట్లుగా తెలిపాయి.
బ్యాంకులు ఈ రుణాలను కనీసం రూ.25,000 నుంచి గరిష్ఠంగా రూ.5,00,000 వరకు ఇస్తున్నాయి. రుణ వ్యవధి గరిష్ఠంగా ఐదేళ్ల వరకూ పెట్టుకునేందుకు వెసులుబాటును కల్పించాయి. తక్కువ వడ్డీ రేటుతోపాటు కాల పరిమితి కూడా ఎక్కువ కల్పిస్తుండటం చాలా మందిని ఆకర్శిస్తున్నాయి. అయితే ఆయా బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ కానీ పింఛను ఖాతా ఉన్న వారికే ఈ రుణాలను అందిస్తున్నాయి. ఇలా కాకుండా అప్పటికే ఆయా బ్యాంకుల్లో గృహ రుణం, వాహన రుణం, ఇలా కాకుండా పర్సనల్ లోన్ తీసుకుని సక్రమంగా చెల్లిస్తున్నట్లైతే వారికి కూడా ఈ అవకాశం ఇస్తున్నాయి. వీరితోపాటు కరెంటు అకౌంట్ ఉన్న వ్యాపారులకు.. ఐటీ రిటర్నన్స్ అందిస్తున్నవారికి కూడా ఈ కోవిడ్ రుణం ఇస్తామని అంటున్నాయి.
కొవిడ్-19 చికిత్స తర్వాత చేతిలో డబ్బు లేనప్పుడు ఈ రుణం తీసుకుంటే కాస్త వెసులుబాటు దొరుకుతుంది. అయితే, అప్పు ఇస్తున్నారు కదా అని అవసరం లేకపోయినా రుణం తీసుకోవడం అంత మంచిది కాదు. దీర్ఘకాలంలో ఇది భారంగానే మారుతుంది.