Milkha Singh: మళ్లీ ఆసుపత్రిలో చేరిన భారత అథ్లెట్ దిగ్గజం.. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ICUకి మిల్కా సింగ్..
Milkha Singh: అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు తిరిగి చండీఘడ్ లోని PGIMER ఆసుపత్రికి చేర్పించారు....
ప్రముఖ భారత అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు తిరిగి చండీఘడ్ లోని PGIMER ఆసుపత్రికి చేర్పించారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం కరోనాతో పోరాడి ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతుండటంతో ఐసీయూకి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
మిల్కా సింగ్.. మే 20వ తేదీన కొవిడ్‌తో ఆసుపత్రిలో మిల్కా సింగ్, ఆయన భార్య ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కోవిడ్ వైరస్ లక్షణాలు కనిపించడంతో ఇద్దరూ హోం ఐసోలేషన్ లో ఉంటూ.. వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకున్నారు. అనంతరం మొహాలీలోని ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులపాటు చికిత్స తీసుకన్న మిల్కా సింగ్ కోవిడ్ నుంచి వేగంగా కోలుకున్నారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు మిల్కాసింగ్‌ను డిశ్చార్జ్ చేశారు. ఇక మిల్కా సింగ్ భార్య నిర్మలా కౌర్‌కు కొంత ఆక్సిజన్ తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆమెను గత శనివారం ఐసీయూకు తరలించినట్లు చికిత్స అందిస్తున్నారు.