Andhra Pradesh: రెండు వారాల్లో 24 వేల మంది చిన్నారులకు పాజిటివ్… ముంచుకొస్తున్న థర్డ్ వేవ్‌కు ఇది సంకేతమా..!

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Jun 04, 2021 | 8:04 AM

ఇప్పటికే రెండోదశ భయం ముగియనే లేదు.. అప్పుడే మూడోదశ ఆందోళన మొదలైంది. ఈ దశలో టార్గెట్ ఎవరూ..? ఎవరిపై కరోనా పడగ విప్పుతోంది..? ఎవరిపై బుసలు కొడుతోంది..? అవును

Andhra Pradesh: రెండు వారాల్లో 24 వేల మంది చిన్నారులకు పాజిటివ్... ముంచుకొస్తున్న థర్డ్ వేవ్‌కు ఇది సంకేతమా..!
Covid Third Wave

ఇప్పటికే రెండోదశ భయం ముగియనే లేదు.. అప్పుడే మూడోదశ ఆందోళన మొదలైంది. ఈ దశలో టార్గెట్ ఎవరూ..? ఎవరిపై కరోనా పడగ విప్పుతోంది..? ఎవరిపై బుసలు కొట్టబోతోంది ..? అవును ఇది నిజం.. మరో వేవ్ మొదలైందా..? క‌రోనా థ‌ర్డ్ వేవ్ చిన్నారుల‌కు ముప్పుగా ప‌రిణ‌మిస్తుంద‌నే ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో వైర‌స్ త‌న‌ స్వ‌భావం మార్చుకుంటే పిల్ల‌ల‌పై అధిక ప్ర‌భావం చూప‌వ‌చ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ దశలో చిన్నారులపై వైరస్  తీవ్ర దుష్ప్రభావాలు చూపే అవకాశముందని అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ ప్రభువం ఏపీలో కనిపిస్తున్నట్లుగా ఉంది. గత రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 2.3 లక్షల కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. మే 18- 31 మధ్యలో 23,920 కేసులు 18 ఏళ్లలోపు పిల్లల్లో నమోదయ్యాయి. ఐదు సంత్సరాల లోపువారు కూడా ఇందులో ఉన్నారు. వారిలో 2,209 మంది పిల్లలు సంవత్సరాలు వైరస్ బారిన పడ్డారు.

ఈ సమయంలో రాష్ట్రంలోని ప్రధాన హాట్ స్పాట్ అయిన తూర్పు గోదావరిలో సుమారు 4,200 మంది చిన్నారు కోవిడ్ బారిన పడినట్లుగా వైద్యులు గుర్తించారు. మరో కోవిడ్ సెంటర్ చిత్తూరులో సమారు 3,800 మంది పిల్లలు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా మారుతోందని జిల్లా రాష్ట్రీయ బాల్ శ్వాస కార్యక్రమం(RBSK) శిశువైద్యుడు డాక్టర్ చంద్ర శేఖర్ తెలిపారు. మొదటి వేవ్‌లో ఈ ప్రభావం వృద్దులపై… రెండో వేవ్‌లో యువతపై కనిపించిందని అన్నారు.

అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఆ ముప్పును  ఎదుర్కోవడంపై  స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో సుమారు 30 లక్షలమంది చిన్నారులు వైరస్‌ బారినపడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది  రాష్ట్ర సర్కర్. వీరిలో సుమారు 6000-8000 మంది వరకూ ICUలో చికిత్స పొందే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులోనూ 1 శాతంమంది చిన్నారుల్లో ప్రమాదకరమైన ‘మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (MIS-C) అటాక్ కావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బాలలకు మెరుగైన వైద్యసేవలందించడానికి ప్రభత్వం ఇప్పటి నుంచే రెడీ అవుతోంది. ఇటీవల వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, కొవిడ్‌ నిపుణుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  ముందస్తు ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

కరోనా  తొలిదశలో చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే.. రెండోదశలో మాత్రం ముప్పు కొద్దిగా కనిపించింది. గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో తొలి, మలి దశల్లో మొత్తం 81,967 మంది పిల్లలు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ రెండు దశల్లోనూ ఒక శాతం కూడా ఆసుపత్రుల్లో ప్రమాదకర స్థితిలో చికిత్స పొందలేదని వైద్యవర్గాలు అంటున్నాయి. అయితే జూన్‌-ఆగస్టు మధ్య ప్రమాదకరమైన ‘మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎంఐఎస్‌-సి)’ కేసులు పెరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

చిన్నారుల‌పై వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు. చిన్నారుల‌కు ఇన్ఫెక్ష‌న్లు సోకినా వాటి ల‌క్ష‌ణాలు పెద్ద‌గా ఉండ‌వ‌ని, వారికి కొవిడ్ సోకినా తీవ్రత ఉండ‌ద‌ని అన్నారు. చిన్నారుల‌పై వైర‌స్ ప్ర‌భావం లేకుండా చూసేలా అన్ని చ‌ర్య‌లూ చేప‌డుతున్నామ‌ని చెప్పారు. పిల్ల‌ల‌పై వైర‌స్ తీవ్ర‌త లేకుండా చూసేలా దీటైన ఆరోగ్య, సాంకేతిక మౌలిక వ‌స‌తుల‌ను స‌మ‌కూరుస్తున్నామ‌ని అన్నారు.

ఇవి కూడా చదవండి : TS EAMCET 2021: టీఎస్ ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అలెర్ట్.. ఇంటికి సిలిండర్ డెలివరీ చెయ్యాలంటే.! ఆ కోడ్ తప్పనిసరి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu