RBI Monetary Policy 2021: కరోనా సెకెండ్ వేవ్‌లో ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో మార్పుల లేదని ప్రకటన
RBI Monetary Policy: రెపో రేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఆరోసారి. ఈ నిర్ణయం రుణగ్రహీతలందరికీ బాగా ఉంపయోగకరంగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని ధృవీకరించే భయాలు...
దేశంలో కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారంనాడు జరిగిన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు. రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఆరోసారి. ఈ నిర్ణయం రుణగ్రహీతలందరికీ బాగా ఉంపయోగకరంగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని ధృవీకరించే భయాలు జూన్ 4 న వడ్డీ రేట్లతో సంబంధం లేకుండా MPC ని నివారించవచ్చు.
మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు దాస్ తెలిపారు. గత ఆరు ఏళ్లుగా రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయడం లేదు ఆర్బీఐ. ఫ్లోటింగ్ రిటైల్ రుణ రేట్లు గత రెండు దశాబ్దాలలో కనిష్ట స్థాయిలో ఉన్నందున గృహ రుణ రుణగ్రహీతలకు ఇది ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుంది. ఈ తక్కువ వడ్డీ రేటు కొనసాగింపు రుణగ్రహీతలందరికీ బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు (MSF), బ్యాంకు రేట్లు కూడా 4.25 శాతంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాగా, 2022 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనాను 9.5 శాతానికి ఆర్బీఐ తగ్గించింది. గతంలో ఇది 10.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.