Real Estate: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..
ఆదాయం ఉన్న వారు చాలా మంది ఆస్తులు పెంచుకోవడం కోసం అనేక చోట్ల పెట్టుబడులు పెడుతుంటారు...
ఆదాయం ఉన్న వారు చాలా మంది ఆస్తులు పెంచుకోవడం కోసం అనేక చోట్ల పెట్టుబడులు పెడుతుంటారు. బ్యాంక్‌లు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు(stock market), బంగారం(gold) మొదలైన చోట్ల తమ డబ్బును పెట్టుబడిగా పెడుతుంటారు. రియల్ ఎస్టేట్(Real Estate)లో పెట్టుబడులు ముందు చూపు ఉన్నట్లు పరిగణించవచ్చు. అయితే, దీనికి అధిక సొమ్ము అవసరమవుతాయి. నగదు లిక్విడ్ రూపంలో డిపాజిట్ చేసి ఉంటే ఎప్పుడైనా మధ్యలోనే తీసుకోవాలని అనిపించవచ్చు. అయితే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే ఇలా కుదరదు. కొంత మంది తమ ఇంటికి పెట్టే పెట్టుబడినే రియల్ ఎస్టేట్ పెట్టుబడిగా పరిగణించేవాళ్లు ఉంటారు. ఇంటి పరిమాణాన్ని బట్టి అద్దెలకు ఇచ్చుకోవచ్చు. అధిక లాభార్జన అవకాశమొచ్చినపుడు ఇంటి విక్రయానికి పెట్టొచ్చు.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం అనేది లాభదాయకత కోసం ఎల్లప్పుడూ మంచి ఎంపికగా అవుతుంది. అందువల్ల పెట్టుబడి నుండి గరిష్ఠ ఆదాయాన్ని సంపాదించడానికి కొన్ని అంశాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఇంటి మీద పెట్టుబడి పెట్టేటపుడు ఆస్తి ఉన్న స్థానంతో పాటు ఇంటి డిజైన్, నాణ్యత కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఊహించలేని పరిస్థితులను ఎదుర్కొనేటపుడు ఇల్లు జీవిత పొదుపు వనరుగా పనిచేస్తుంది.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన ప్రమాణాలలో ప్రాపర్టీ లొకేషన్ ఒకటి. విద్యాలయాలు, మార్కెట్‌లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, రవాణా సౌకర్యాలు సమీపంలోనే ఉండటం, ఇతర ప్రాంతాలకు కనెక్ట్ అయి ఉందని నిర్ధారించుకోవాలి. అయితే, వీటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. సిటీకి దూరంగా ఉన్న ఆస్తి ధర కాస్త తక్కువగా ఉండవచ్చు.
మంచి డిజైన్‌తో నిర్మించిన ఇల్లు ఎక్కువ సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా కొత్తగానే అనిపిస్తుంది. ఒక భవనాన్ని మంచి నిర్మాణ సంస్థ రూపొందించినప్పుడు, బాగా డిజైన్ చేసినపుడు, ప్రీమియం నాణ్యత కలిగిన ఉత్పత్తులు ఇంటికి వాడటం వలన ఇంటి నిర్మాణం బాగుండడమే కాకుండా భవిష్యత్తులో మరమ్మత్తు, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. తద్వారా ఆస్తి విలువ పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాటినే కొనుగోలు చేయడం ఉత్తమం. ఇల్లు విలువ పెరగడంతో పాటు, యజమానికి ఇంటి అద్దె ఆదాయం కూడా వస్తుంది. బాగా డిజైన్ చేయబడిన, నాణ్యమైన మెటీరియల్, నిర్మాణ సాంకేతికతలను ఉపయోగించిన ఒక ప్రధాన ప్రదేశంలో ప్రాపర్టీని ఎంచుకోవడం వలన ఇంటి అద్దె రూపంలో అదనపు ఆదాయం వస్తుంది. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఈ ఇంటి అద్దెలు ప్రధాన ఆదాయ వనరుగా కూడా ఉంటాయి, వారికి ఒకే ఇల్లు ఉన్నట్టయితే రివర్స్ మోర్ట్ గేజ్ కింద బ్యాంకు కి ఇల్లు తాకట్టు పెట్టి నెల నెలా ఆదాయం పొందొచ్చు.
Read Also.. PPF: ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే పీపీఎఫ్‌లో ఎక్కువ వడ్డీ వస్తుందా.. అది ద్రవ్యోల్బణం కంటే అధికంగా ఉంటుందా..