Fixed Deposits: ఖాతాదారులకు ఆ బ్యాంకుల గుడ్‌న్యూస్.. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల తగ్గింపు
భారతదేశంలో స్థిరమైన ఆదాయానికి ప్రతి రూపంగా పెట్టుబడిదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్లను చూస్తారు. పెట్టుబడికి రక్షణతో పాటు రాబడికి భరోసా ఉండడంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు నెలవారీ ఆదాయం కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ రెండు బ్యాంకులు ఖాతాదారులకు షాక్ ఇచ్చాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో పాటు బంధన్ బ్యాంకు కూడా ఖాతాదారులకు షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నాయి. పంజాబ్ ఏప్రిల్ 2025లో రెపోరేటు ప్రకారం మార్పులు చేసిన కొన్ని వారాల తర్వాత రూ. 3 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డీ వడ్డీ రేట్లను మరోసారి సవరించింది . ఈ తాజా సవరనలో మే 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. ఎంపిక చేసిన స్వల్ప, మధ్యస్థ కాల వ్యవధిపై 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు ప్రకటన వడ్డీ రేట్లు భారగా తగ్గాయి. పీఎన్‌బీలో తాజా సవరణ తర్వాత 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలపరిమితి కలిగిన సాధారణ పౌరులకు 3.50 శాతం నుండి 7.10 శాతం వరకు ఎఫ్‌డీ వడ్డీ రేట్లను అందిస్తుంది. 390 రోజుల డిపాజిట్‌పై అత్యధికంగా 7.10 శాతం రేటు లభిస్తుంది.అయితే సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత రేట్లను అందిస్తుంది.
సీనియర్ సిటిజన్లు (60 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు) 5 సంవత్సరాల వరకు డిపాజిట్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు, 5 సంవత్సరాలకు పైగా డిపాజిట్లకు అదనంగా 80 బేసిస్ పాయింట్లు పొందుతారు. అంటే వడ్డీ రేటు 4.00 శాతం నుండి 7.60 శాతం వరకు ఉంటుంది. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లు (80 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ) అన్ని మెచ్యూరిటీల్లో అదనంగా 80 బేసిస్ పాయింట్లు అందిస్తుంది. ప్రభావవంతమైన వడ్డీ రేటు 4.30 శాతం నుంచి 7.90 శాతం వరకు ఉంటుంది.
బంధన్ బ్యాంక్ కూడా మే 1, 2025 నుంచి అమలులోకి వచ్చే విధంగా రూ. 3 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో సవరణను ప్రకటించింది. సాధారణ పౌరులకు వడ్డీ రేట్లు ఇప్పుడు 3 శాతం నుండి 7.75 శాతం వరకు ఉన్నాయి. ముఖ్యంగా బంధన్ బ్యాంకు ఒక సంవత్సరం కాలపరిమితిపై అత్యధిక రేటు అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం నుంచి 8.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. అయితే వీరికి కూడా 1-సంవత్సరం డిపాజిట్‌పై కూడా గరిష్ట వడ్డీ రేటును అందిస్తుంది.
గత నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతానికి తగ్గించింది. కేంద్ర బ్యాంకు గతంలో ‘తటస్థ’ నుంచి ‘సౌకర్యవంతమైన’ వైఖరిని అవలంభించినందున భవిష్యత్ ద్రవ్య విధానాల్లో కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








