AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం చిత్రమూ.. విద్యార్థులను ఊరేగించిన ఉపాధ్యాయులు.. ఎందుకంటే..!

విద్యాబుద్ధులు నేర్పిన గురువులను విద్యార్థులు ఎంతో గౌరవిస్తుంటారు. పదవి విరమణ చేసే సమయంలో గురువులను ఘనంగా సన్మానించుకుంటారు. ఓపెన్ టాప్ వాహనాల్లో బ్యాండ్ భాజాలతో ఊరేగిస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్.. విద్యార్థులనే ఓపెన్ టాప్ కారులో టీచర్లు పుర వీధుల్లో ఊరేగించారు. ఎందుకు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ఇదేం చిత్రమూ.. విద్యార్థులను ఊరేగించిన ఉపాధ్యాయులు.. ఎందుకంటే..!
Govt.school Students Paraded
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: May 04, 2025 | 11:47 AM

Share

విద్యాబుద్ధులు నేర్పిన గురువులను విద్యార్థులు ఎంతో గౌరవిస్తుంటారు. పదవి విరమణ చేసే సమయంలో గురువులను ఘనంగా సన్మానించుకుంటారు. ఓపెన్ టాప్ వాహనాల్లో బ్యాండ్ భాజాలతో ఊరేగిస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్.. విద్యార్థులనే ఓపెన్ టాప్ కారులో టీచర్లు పుర వీధుల్లో ఊరేగించారు. ఎందుకు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ఒకటి ఒకటి.. రెండు రెండూ.. మూడు మూడు.. ర్యాంకులు అంటూ ఊదరగొట్టే ప్రైవేట్ పాఠశాలలకే నేటి విద్యా వ్యవస్థలో ఆదరణ ఉంటుంది. తల్లితండ్రులు కూడా అలాంటి ప్రైవేట్ పాఠశాలలకే మొగ్గు చూపుతున్నారు. ఆర్ధికంగా భారమైనప్పటికీ తమ పిల్లలను ప్రైవేట్‌లోనే చదివిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వంద శాతం ఫలితాలు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందుతుందని నిరూపించింది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల.

విద్యార్థులను ఓపెన్ టాప్ కారులో ఊరేగింపు..

ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహను తొలగిస్తూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించింది తిరుమలగిరి ప్రభుత్వ పాఠశాల. వంద శాతం ఫలితాలు సాధించాలనే ఉపాధ్యాయుల తపన విద్యార్ధుల కఠోర శ్రమ ఫలించి, పదో తరగతిలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 15 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించారు. దీంతో ఉత్తమ మార్కులు సాధించిన తమ విద్యార్థుల ప్రతిభను వినూత్నంగా ప్రదర్శించారు స్కూల్ టీచర్లు.

500 మార్కులు పైన సాధించిన విద్యార్థులను, వారి మార్కులను ప్రదర్శిస్తూ, ఓపెన్ టాప్ కారులో బ్యాండ్ భాజాలతో తిరుమలగిరి పుర వీధుల్లో ఊరేగించారు. తమ పాఠశాల సాధించిన ఫలితాలను ప్రజలకు వెల్లడిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉత్తమ ఫలితాలు వస్తాయని చాటి చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల తరహాలో సాధించిన ఫలితాలు, విద్యార్థులను తీర్చిదిద్దిన విధానాలను తెలియజేస్తూ కరపత్రాలు పంచారు.

ప్రభుత్వ బడులపై విశ్వాసం..

తాము సాధించిన విజయాలను చూసి ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే, మెరుగైన బోధనా పద్ధతులతో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా తీర్చిదిద్దుతామని భరోసా కల్పించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు నామమాత్రంగా విద్యాబోధన చేస్తారనే అపవాదును తొలగిస్తూ, ప్రభుత్వ పాఠశాల విద్యపై ప్రజల్లో విశ్వాసం కల్పించేలా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఊరేగించామని పాఠశాల హెడ్మాస్టర్ దామర శ్రీనివాస్ చెబుతున్నారు. ఉపాధ్యాయుల బృందం సాధించిన ఫలితాలకు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల ఇక్కడ క్లిక్ చేయండి..