AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Retirement Planning: ఇలా చేస్తే సులభంగా రూ. కోట్లు వెనకేసుకొవచ్చు.. 50 ఏళ్లకే రిటైర్ అయిపోవచ్చు..

ఉద్యోగంలో చేరిన నాటి నుంచే పదవీవిరమణ ప్లానింగ్ కలిగి ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది 50 ఏళ్లకే రిటైర్ కావాలని భావిస్తున్న వారు కూడా ఉంటున్నారు. అంటే ఆ సమయానికే అవసరమైన అన్ని పరిస్థితులను కల్పించుకోని, ఇక రిటైర్ మెంట్ తీసుకోవడం అన్నమాట. ఇది సాధ్యమేనా? సాధ్యమే అంటున్నారు నిపుణులు. అందుకోసం ఫైర్(FIRE) మోడల్ అందుబాటులో ఉందని చెబుతున్నారు.

Retirement Planning: ఇలా చేస్తే సులభంగా రూ. కోట్లు వెనకేసుకొవచ్చు.. 50 ఏళ్లకే రిటైర్ అయిపోవచ్చు..
Retirement Planning
Madhu
| Edited By: |

Updated on: Nov 02, 2023 | 9:53 PM

Share

ప్రతి ఒక్కరికీ రిటైర్ మెంట్ ప్లానింగ్ ఉండాలి. అంటే పదవీవిరమణ తర్వాత సుఖమయ జీవనం కోసం ముందుగానే ప్రణాళిక చేసుకోవడం. ఇటీవల కాలంలో కొడుకులు, కోడళ్లు పట్టించుకోక ఇబ్బందులు పడుతున్న వృద్ధులను చాలా మంది మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఆస్తులు సంపాదించి వారసులకు అప్పజెప్పిన తర్వాత వృద్ధులను చులకన చూసే వారు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లోనే పదవీవిరమణ ప్రణాళిక మీకు ఉపకరిస్తుంది. దీనిలో ముందగానే డబ్బు ఆదా చేస్తుంటాం కాబట్టి.. వృద్ధాప్యంలో అవి మీకు అక్కరకు వస్తాయి. సాధారణంగా అందరూ 60 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతాం కదా.. అప్పుడు చూసుకోవచ్చులే అనుకొని దీనిని నిర్లక్ష్యం చేస్తారు. అయితే అది కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచే పదవీవిరమణ ప్లానింగ్ కలిగి ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది 50 ఏళ్లకే రిటైర్ కావాలని భావిస్తున్న వారు కూడా ఉంటున్నారు. అంటే ఆ సమయానికే అవసరమైన అన్ని పరిస్థితులను కల్పించుకొని, ఇక రిటైర్ మెంట్ తీసుకోవడం అన్నమాట. ఇది సాధ్యమేనా? సాధ్యమే అంటున్నారు నిపుణులు. అందుకోసం ఫైర్(FIRE) మోడల్ అందుబాటులో ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫైర్ మోడల్ అంటే ఏమిటి? దీనిని ఎవరూ తీసుకొచ్చారు? దానితో లాభాలు ఎలా ఉంటాయి? తెలుసుకుందాం రండి..

ఫైర్(FIRE) మోడల్..

ఫైర్ మోడల్ 1992లో విక్కీ రాబిన్, జో డొమింగ్యూజ్ రాసిన యువర్ మనీ ఆర్ యువర్ లైఫ్ అనే పుస్తకం నుంచి తీసుకున్న స్ట్రాటజీ. ఈ మోడల్ కింద, మీరు మీ సొంత పదవీ విరమణ వయస్సును మీరే నిర్ణయించుకోవచ్చు. అయితే, మీరు ఈ మోడల్ ను అవలంభిస్తే, మీరు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఎందుకంటే మీ జీతంలో 70 శాతం వరకు పొదుపులో పెట్టవలసి ఉంటుంది. ముందుగానే రిటైర్ కావాలంటే, మీరు ముందుగానే పెట్టుబడిని ప్రారంభించాలి. అవసరమైన దానికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. అందుకు మీకు ఈ FIRE (ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ) మోడల్‌ బాగా ఉపయోగపడుతుంది. ఈ మోడల్‌ను అనుసరించడానికి మీరు మీ ఖర్చులలో కొంత భాగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఇది 10 సంవత్సరాల ముందుగానే పదవీ విరమణ చేసే స్వేచ్ఛను మీకు అందిస్తుంది.

పొదుపు పెంచాలి.. ఈ మోడల్ కింద, మీ పొదుపు గరిష్టంగా ఉండటం చాలా ముఖ్యం. అలాగే మీ ఖర్చులను నియంత్రించడమే కాకుండా, వాటిని తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నించాలి. మీరు ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే, మీరు ఎంత త్వరగా పదవీ విరమణ చేయగలుగుతారు. అలాగే పదవీ విరమణ సమయంలో మీ పెన్షన్ అంత ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆదాయాన్ని పెంచుకోవాలి.. మీరు ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం చేస్తే ఫర్వాలేదు, లేకపోతే మీ జీతం కూడా పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. మంచి జీతం వచ్చే ఉద్యోగం కోసం వెతకవచ్చు. మీరు కొంత పార్ట్ టైమ్ లేదా ఫ్రీలాన్సింగ్ పనిని కూడా చేయవచ్చు, తద్వారా మీరు కొంత అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. మీరు మరింత ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టగలిగే ఈ అదనపు ఆదాయం నుంచి మీరు ప్రయోజనం పొందుతారు.

డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి.. డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు, మీరు కొంత రిస్క్ తీసుకోవలసి ఉంటుంది. వివిధ సాధనాల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, మీరు మీ పెట్టుబడిలో సగం స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. కొంత భాగంతో, మీరు అద్దె ఆస్తిని కొనుగోలు చేయవచ్చు, తద్వారా డబ్బు సంవత్సరాలుగా వస్తూ ఉంటుంది. భూమిని కొనుగోలు చేయడం ద్వారా కూడా, మీరు దానిపై బలమైన రాబడిని పొందవచ్చు. పీపీఎఫ్ వంటి సాధనాలలో కొంత డబ్బును కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇప్పుడు చెప్పిన విధానాల్లో కేవలం పీపీఎఫ్ మాత్రమే స్థిరమైన రాబడిని పొందగలుతారు. మిగిలిన వాటిపై రాబడులు స్థిరంగా ఉండవు. కాబట్టి మీ పెట్టుబడులను క్రమం తప్పకుండా ట్రాక్ చేస్తూ ఉండాలి. అవసరమైనప్పుడు మీ పోర్ట్‌ఫోలియోలో తక్షణ మార్పులు చేయాలి.

ఈ ఉదాహరణ చూడండి..

మీ వయస్సు 25 సంవత్సరాలు అనుకోండి. మీ జీతం దాదాపు రూ. 40,000 వస్తోంది. మీరు చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారనుకుందాం. అద్దె, రేషన్, ప్రయాణం, వినోదం, ఆరోగ్య బీమా, జీవిత బీమా మొదలైనవాటికి మీరు ప్రతి నెలా రూ. 25,000 వెచ్చిస్తున్నారని అనుకుందాం. మిగిలిన డబ్బును కొంచెం రిస్క్ తీసుకొని డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే సగటున 12 శాతం రాబడిని పొందవచ్చు. అదే పీపీఎఫ్ లో పెట్టుబడి పెడితే మీరు దాదాపు 7.1 శాతం రాబడిని పొందుతారు. అదే ప్రాపర్టీలో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో సగటున 12శాతం రాబడని ఆశించవచ్చు.

50 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ..

మీరు 50 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేయాలనుకుంటే, మీ ప్రస్తుత ఖర్చులు రూ. 25,000 అయితే, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి పదవీ విరమణ సమయంలో మీకు దాదాపు రూ. 80,000 అవసరం అవుతాయి. దాని కోసం, మీరు సుమారు రూ. 2 కోట్ల కార్పస్ తయారు చేయాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, మీరు ప్రతి నెలా సుమారు రూ. 6,000 పెట్టుబడి పెట్టాలి. ప్రతి సంవత్సరం 10 శాతం పెంచుతూ వెళ్లాలి. ఈ విధంగా, మీరు 50 సంవత్సరాల వయస్సులో దాదాపు రూ. 2 కోట్ల కార్పస్‌ను కూడగట్టుకుంటారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..