PI network coin: ట్రేడింగ్ లో వెనుకబడిన పైకాయిన్.. ధర తగ్గిపోవడంతో అందరికీ నిరాశ
ప్రపంచంలో ప్రతి దేశానికి ప్రత్యేక కరెన్సీ ఉంటుంది. డాలర్, రూపీ, యెన్, రూబుల్ తదితర అనేక పేర్లతో దాన్ని పిలుస్తారు. ఆయా దేశాలకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా కరెన్సీ విలువ పెరుగుతూ ఉంటుంది. ఈ కరెన్సీతో అంతర్జాతీయ స్థాయిలో వర్తక, వ్యాపారాలు జరుగుతాయి. అయితే ఇటీవల కాలంలో క్రిప్టో కరెన్సీ మాట తరచూ వింటున్నాం. ఇది ఏ దేశం పరిధిలోని రాని డిజిటల్ కరెన్సీ అని చెప్పవచ్చు. కంప్యూటర్ నెట్ వర్క్ ఆధారంగా పనిచేస్తుంది.

క్రిప్టో కరెన్సీకి చెందిన పై నెట్ వర్క్ కాయిన్ కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది. అయితే ట్రేడింగ్ సమయంలో ధర తగ్గిపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. పై కాయిన్ నెట్ వర్క్ లో ప్రపంచ వ్యాప్తంగా 70 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. దీని ఓపెన్ నెట్ వర్క్ గురువారం అధికారికంగా ప్రారంభమైంది. అంటే వినియోగదారులు తమ కాయిన్ ను మొదటి సారిగా నెట్ వర్క్ వెలువల బదిలీ చేసుకునే వీలు కలిగింది. ఇప్పుడు ఓకేకే, బిట్జెట్, కాయిన్ డీసీఎక్స్ తదితర క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ లలో ఈ క్రిప్టో కాయిన్ అందుబాటులో ఉంది. గతంలో కొనుగోలు చేసిన వారు దీన్ని ట్రేడింగ్ చేసుకోవచ్చు. మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి దాని ధర ఉంటుంది.
పై కాయిన్ ట్రేడింగ్ అంత ఆశాజనకంగా జరగలేదు. తొలి రోజు గురువారం లిస్టింగ్ సమయానికి 1.97 డాలర్లు ఉన్న ధర శుక్రవారం ఉదయం ట్రేడింగ్ సమయానికి 62.63 శాతం తగ్గిపోయి, 0.733 డాలర్లకు దిగిపోయింది. కాగా..పై నెట్ వర్క్ అనేది వెబ్ 3 బ్లాక్ చెయిన్ ప్రాజెక్టు. దీన్ని వినియోగదారుల తమ మొబైల్ ఫోన్లలో మైనింగ్ చేయవచ్చు. ఇతర క్రిప్టో కరెన్సీల మాదిరిగా ఖరీదైన కంప్యూటర్లు అవసరం లేదు. పై నెట్ వర్క్ ను 2019లో స్టాన్ పోర్డు గ్రాడ్యుయేట్లు ప్రారంభించారు.
మొబైల్ ఫోన్ లో మైనింగ్ చేసే విధానం
- పై కాయిన్ ను మొబైల్ ఫోన్ లో చాలా సులభంగా మైనింగ్ చేసుకోవచ్చు. ముందుగా పై నెట్ వర్క్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఇన్ స్టాల్ చేసుకోవాలి.
- మైనింగ్ ప్రారంభించడానికి మెరుపు బోల్డ్ చిహ్నాన్ని ప్రెస్ చేయాలి. తద్వారా పై సంపాదించడం ప్రారంభించండి.
- మూడు రోజుల తర్వాత మీ మైనింగ్ రేటును పెంచడానికి మూడు నుంచి ఐదు కాంటాక్టులను ఎంటర్ చేయండి. అంటే మీ స్నేహితులను పరిచయం చేయండి
- ఆదాయాలను పెంచడానికి మీ రిఫరల్ కోడ్ ను షేర్ చేయాలి.
పై నెట్ వర్క్ అనేది సామాజిక లక్షణాలు, అభివృద్ధి సాధనాలు, వాస్తవ ప్రపంచ ఉపయోగాలను మిళితం చేసే ఒక ప్రత్యేక మైన క్రిప్టోకరెన్సీ ప్లాట్ ఫాం. వినియోగదారులు తమ మొబైల్ ద్వారా ఈ కాయిన్ ను సులభంగా మైనింగ్ చేయవచ్చు. అయితే బిట్ కాయిన్ వంటి ఇతర క్రిప్టో కరెన్సీలకు శక్తివంతమైన కంప్యూటర్లు అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








