AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tatkal Tickets: సింపుల్ ట్రిక్స్‌తో తత్కాల్ టిక్కెట్స్ బుకింగ్.. ఆ ఒక్క విషయమే ముఖ్యం

భారతదేశంలో రైలు ప్రయాణం అనేది చౌకైన రవాణా సాధనంగా ఉంటుంది. అయితే రైలు ప్రయాణ సమయంలో టిక్కెట్ అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది. చివరి నిమిషంలో ప్రయాణం అంటే చాలా మంది సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి వారికి తత్కాల్ టిక్కెట్స్ ఓ పెద్ద ఉపశమనంగా ఉంటుంది.

Tatkal Tickets: సింపుల్ ట్రిక్స్‌తో తత్కాల్ టిక్కెట్స్ బుకింగ్.. ఆ ఒక్క విషయమే ముఖ్యం
Train
Nikhil
|

Updated on: Feb 22, 2025 | 7:27 PM

Share

తత్కాల్ టిక్కెట్లు అనేవి అత్యవసర లేదా చివరి నిమిషంలో ప్రయాణాలకు అనువగా ఉంటాయి. అయితే అధిక డిమాండ్ కారణంగా ఈ టిక్కెట్స్ బుక్ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడం నిజంగా కష్టం. అయితే కొన్ని సాధారణ టిప్స్ పాటిస్తే తత్కాల్ టిక్కెట్లను విజయవంతంగా బుక్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే తత్కాల్ బుకింగ్ విండోలు ఎప్పుడు తెరుస్తారో? కచ్చితమైన సమయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిర్దిష్ట సమయాల్లో ప్రయాణానికి ఒక రోజు ముందు తత్కాల్ బుకింగ్ విండో తెరుస్తారు. ఏసీ టిక్కెట్ల బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. స్లీపర్ క్లాస్ టిక్కెట్లు ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.

తత్కాల్ టిక్కెట్లను తక్కువ సమయంలో త్వరగా బుక్ చేసుకోవాలి. కాబట్టి తత్కాల్ బుకింగ్ కోసం హై-స్పీడ్ నెట్వర్క్ కనెక్టివిటీ అవసరం. బుకింగ్ విండో తెరవడానికి కనీసం అరగంట ముందు కొన్ని వివరాలను ఐఆర్‌సీటీసీ యాప్‌లో నమోదు చేయాలి. ఇలా చేస్తే సమయం ఆదా అవుతుంది. యాప్‌ను ఓపెన్ చేసి ‘ఖాతా’ లింక్ పై క్లిక్ చేయాలి. ‘మై మాస్టర్’ జాబితాను ఎంచుకుని, మాస్టర్ లిస్ట్ పై క్లిక్ చేసి ప్రయాణికుల పేరు, ఇతర వివరాలను జోడించండి. మీరు దీన్ని ముందుగానే చేస్తే, తత్కాల్ బుకింగ్ చేసేటప్పుడు ప్రయాణికుల పేర్లను సులభంగా ఎంచుకోవచ్చు. అయితే నాన్ ఏసీ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు మాస్టర్ జాబితాను జోడించలేరు. ఈ జాబితాను ఏసీ కోచ్‌లో బుకింగ్ చేసుకునే సమయంలోనే అందుబాటులో ఉంటుంది. 

చెల్లింపులు ఆలస్యమైతే టిక్కెట్ బుక్ కాదు. కాబట్టి క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయడానికి సమయం పడుతుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించే సమయంలో మీకు సరైన సమయంలో ఓటీపీ అందకపోతే ఇబ్బందులు పడతారు. కాబట్టి ఐఆర్‌సీటీసీ ఈ-వాలెట్‌లో ముందుగానే సొమ్మును యాడ్ చేసి చెల్లింపులు చేస్తే టిక్కెట్ ఈజీగా బుక్ అవుతుంది. తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఐఆర్‌సీటీ యాప్‌లో ముందుగానే లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉదయం 11 గంటలకు ఒక నిమిషం ముందు లాగిన్ అయితే అన్ని ఖాతాలు స్వయంచాలకంగా లాగ్ అవుట్ అవుతాయి. కాబట్టి సరిగ్గా ఉదయం 11 గంటలకు లాగిన్ అవ్వడం మంచిది. లాగిన్ అయిన తర్వాత, టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మీరు కనీసం రెండుసార్లు క్యాప్చా కోడ్స్ నమోదు చేయాలి. కాబట్టి క్యాప్చాను ఎంటర్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా నమోదు చేయాలి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి