AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Cards: వ్యాపారస్తులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులు

ఇటీవల కాలంలో యువత ఆలోచనా విధానం మారుతుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే విషయంలో యువత తీరు విభిన్నంగా ఉంటుంది. ఒకరి కింద పని చేసే కంటే ఒకరికి పని ఇచ్చేలా వ్యాపార రంగం వైపు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారస్తులకు ఊరటినిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

Credit Cards: వ్యాపారస్తులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులు
Credit Cards
Nikhil
|

Updated on: Feb 22, 2025 | 5:41 PM

Share

2025 కేంద్ర బడ్జెట్‌లో హామీ ఇచ్చినట్లుగా చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడి సమస్య నుంచి రక్షణ కల్పించేలా ఏప్రిల్ నుంచి రూ. 5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులను అందించేందుకు కేంద్ర కీలక చర్యలను తీసుకుంది. ఈ సౌకర్యం రాబోయే కొన్ని సంవత్సరాలలో మైక్రో-ఎంట్రప్యూనర్స్‌కు అదనంగా రూ. 30,000 కోట్ల నిధులను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపార విస్తరణ కోసం ఇతర రుణ ఎంపికలకు అనుబంధంగా ఈ స్కీమ్ ఉండనుంది. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి, క్రెడిట్ కార్డు పొందడానికి వ్యాపారుస్తులు ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల పరిమితితో ఈ క్రెడిట్ కార్డును పొందడానికి వ్యాపారులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలను తెలుసుకుందాం.

రూ. 5 లక్షల పరిమితి కలిగిన క్రెడిట్ కార్డు దుకాణాలను నిర్వహించే, కుటీర పరిశ్రమల యజమానులకు అందుబాటులో ఉంటుంది. అయితే యజమానులకు వారి యూపీఐ లావాదేవీలు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, వ్యాపార పరిస్థితుల అంచనా తర్వాత క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తారు. ఈ కార్డుకు ఒక సంవత్సరం చెల్లుబాటు వ్యవధి ఉంటుంది. రూ. 10 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య వార్షిక టర్నోవర్ ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ మైక్రో-క్రెడిట్ కార్డుకు అర్హులు.

నమోదు చేసుకోవడం ఇలా

  • ప్రభుత్వం జారీ చేసిన ఈ క్రెడిట్ కార్డును పొందడానికి దేశవ్యాప్తంగా ఉన్న చిన్నతరహా వ్యాపారవేత్తలు ఉద్యమం పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం వారు ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డును పొందవచ్చు.
  • అఫిషియల్ ఉద్యమం పోర్టల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • అక్కడ ‘క్విక్ లింక్స్’ పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ‘ఉద్యమం రిజిస్ట్రేషన్’ ఎంచుకోవాలి.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి సూచనలను అనుసరించాల్సి ఉంటుంది. 

కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో ముఖ్యంగా చిన్న వ్యాపార యజమానులకు రూ. 5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డుల సదుపాయం కల్పించింది. అలాగే ఈ బడ్జెట్‌లో రైతులు, మధ్యతరగతికి ప్రజలకు అనేక రాయితీలను అందుబాటులో ఉంచింది. అలాగే వారి నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి రూపొందించిన ముఖ్యమైన పథకాలను కూడా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి