AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best smart TVs: ఈ టీవీలతో ఇంటికి అందం.. కంటికి వినోదం.. బెస్ట్ బ్రాండ్స్‌పై భారీ డిస్కౌంట్

ఇంటికి అందాన్నిచ్చే వివిధ వస్తువులలో టీవీ ముందుంటుంది. కుటుంబ సభ్యులందరికీ ఒకేచోట కూర్చోపెట్టి వినోదాన్ని పంచుతుంది. ఆధునిక కాలంలో అనేక ప్రత్యేకతలతో కూడిన స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ యాప్ ల మద్దతు, వాయిస్ అసిస్టెంట్, మెరుగైన విజువల్, బెస్ట్ ఆడియో తదితర ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్నాయి. సినిమాలు, వివిధ షోలను వీక్షించడంతో పాటు గేమింగ్ కు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. ఇలాంటి ప్రత్యేతకలతో కూడిన ఎల్ జీ, సామ్సంగ్, సోనీ, టీసీఎల్, షియోమి తదితర బ్రాండ్ టీవీలు ప్రస్తుతం అమెజాన్ లో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నాయి. వాటి వివరాలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

Nikhil
|

Updated on: Feb 22, 2025 | 5:00 PM

Share
సామ్‌సంగ్ 55 అంగుళాల స్మార్ట్ టీవీ మీడియం సైజు గదులకు చక్కగా సరిపోతుంది. 4కే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్ తో కూడిన ఎల్ఈడీ డిస్ ప్లే టెక్నాలజీ, 50 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో విజువల్ చాలా స్పష్టంగా ఉంటుంది.  20 వాట్ అవుట్ పుట్ కలిగిన అంతర్నిర్మిత 2 చానల్ స్పీకర్ తో ఆడియో ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. వాయిస్ కమాండ్ ను ఉపయోగించి టీవీని ఆపరేట్ చేయడానికి ఉపయోగపడే బిక్స్బీ, అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ తదితర వాయిస్ అసిస్టెంట్లు ఆకట్టుకుంటున్నాయి. నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జియో సినిమా తదితర ఓటీటీ యాప్ లను వీక్షించవచ్చు. బాహ్య పరికరాలను కనెక్ట్ చేసుకోవడానికి మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్ బీ పోర్టు, బ్లూటూత్, వైఫై తదితర కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. అమెజాన్ లో ఈ టీవీని రూ.43,990కు కొనుగోలు చేయవచ్చు.

1 / 5
 ఎంఐ 55 అంగుళాల టీవీలోని వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 టెక్నాలజీ తో కంటెంట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డాల్బీ విజన్ ఐక్యూతో చిత్రం నాణ్యత చాలా మెరుగ్గా ఉంటుంది. అంతర్నిర్మిత గూగుల్ అసిస్టెంట్ తో హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కమాండ్లకు అవకాశం ఉంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ఓటీటీ యాప్ లకు మద్దతు ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1 బాహ్య పరికరాలతో వేగవంతమైన వైర్ లెస్ కనెక్టివిటీని పొందవచ్చు. 40 వాట్ స్పీకర్, కొత్త డాల్బీ అట్మోస్ టెక్నాలజీ, 5 సెకన్ల కంటే తక్కువ సమయంలో టీవీని ఆన్ చేయగలిగే క్విక్ వేవ్, డబుల్ ట్యాప్ తో త్వరగా వాల్యూమ్ తగ్గించే క్విక్ మ్యూట్ తదితర అదనపు ప్రత్యేకతలు ఉన్నాయి. అమెజాన్ లో రూ.34,990కు ఎంఐ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది.

2 / 5
సోనీ బ్రావియా 55 అంగుళాల స్మార్ట్ టీవీ లోని 4కే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్ స్పష్టమైన విజువల్స్ అందిస్తుంది. 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు, మోషన్ ఫ్లో ఎక్స్ఆర్ టెక్నాలజీ కారణంగా పిక్చర్ క్వాలిటీ చక్కగా ఉంటుంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్  సిస్టమ్ పై పనిచేసే ఈ టీవీలో కంటెంట్ వాచ్ లిస్టు, హ్యాండ్స్ ఫ్రీ ఆపరేషన్ కోసం అంతర్నిర్మిత గూగుల్ అసిస్టెంట్, కిడ్స్ కేర్ ఫీచర్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే వాయిస్ అసిస్టెంట్ తో కూడిన రిమోట్ కంట్రోల్, ఆపిల్ ఎయిర్ ప్లే, క్రోమోకాస్ట్ తో స్మార్ట్ కనెక్టివీటీ ఎంపిక అందుబాటులో ఉన్నాయి. డాల్బీ ఆడియో టెక్నాలజీతో కూడిన అంతర్నిర్మిత 20- వాట్ ఓపెన్ బాఫిల్ స్పీకర్ తో ఆడియో బాగుంటుంది. సోని బ్రావియో టీవీ అమెజాన్ లో రూ.57,990కి అందుబాటులో ఉంది.

3 / 5
ఎల్ జీ నుంచి విడుదలైన ఈ 4కే స్మార్ట్ టీవీలో ఎల్ఈడీ డిస్ ప్లే టెక్నాలజీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా టాప్ క్లాస్ విజువల్స్ చూడవచ్చు. 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు, మోషన్ విజువల్ కారణంగా పిక్చర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీడియం సైజు గదులకు ఈ 55 అంగుళాల టీవీ చక్కగా సరిపోతుంది. ఏ5 ఏఐ ప్రాసెసర్, సులభమైన ఇంటర్నెట్ సర్పింగ్ అదనపు ప్రత్యేకతలు. వివిధ రకాల ఓటీటీ యాప్ లకు మద్దతు ఇస్తుంది. మూడు హెచ్ఢీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్టులు, బ్లూటూత్, వైఫై తదితర కనెక్టివీటి ఫీచర్లు ఉన్నాయి.  గేమ్ ఆప్టిమైజర్ ఫీచర్, అంతర్నిర్మిత 2.0 చానల్ సౌండ్ సిస్టమ్, అమెజాన్ అలెక్సా ఆకట్టుకుంటున్నాయి. ఈ టీవీ అమెజాన్ లో రూ.41,990కి అందుబాటులో ఉంది.

4 / 5
ఉత్తమ 55 అంగుళాల స్మార్ట్ టీవీలలో టీసీఎల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిలో 4కే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్ తో షార్ప్ నెస్, స్పష్టత, మెరుగైన విజువల్ చూడవచ్చు. ఈ క్యూలెడ్ టీవీలో ఏఐపీక్యూ ప్రాసెసర్, అంతర్నిర్మిత డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ తో సినిమా థియేటర్ లో ఉన్న అనుభూతి కలుగుతుంది. స్క్రీన్ మిర్రరింగ్, వెబ్ బ్రౌజింగ్, హ్యాండ్స్ ఫ్రీ ఆపరేషన్ కోసం అంతర్నిర్మిత వాయిస్ అసిస్టెంట్లు ఏర్పాటు చేశారు. గూగుల్ వాచ్ లిస్ట్, గూగుల్ కిడ్స్, ఓకే గూగుల్ తదితర అదనపు ఫీచర్లు బాగున్నాయి. అంతరాయం లేని గేమింగ్ కు ఎంతో వీలుగా ఉంటుంది.  ఈ టీసీఎల్ 55 అంగుళాల టీవీ అమెజాన్ లో రూ.32,990కి అందుబాటులో ఉంది.

5 / 5