- Telugu News Photo Gallery Technology photos Super smartphones with AI features, These are the best under Rs. 30 thousand, Smart Phones details in telugu
Smart Phones: ఏఐ ఫీచర్స్‌తో సూపర్ స్మార్ట్‌ఫోన్స్.. రూ.30 వేలలోపు ది బెస్ట్ ఇవే..!
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. పెరిగిన టెక్నాలజీకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్స్‌లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ రంగాన్ని ఓ ఊపు ఊపుతున్న ఏఐ టెక్నాలజీతో వచ్చే ఫోన్లను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో రూ.30 వేల లోపు ధరతో ఏఐ ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేద్దాం.
Updated on: Feb 22, 2025 | 4:45 PM

వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ 8జీబీ +128 జీబీ వేరియంట్ ధర రూ. 29,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌లో ఇంటెలిజెన్స్ క్వాల్‌కామ్ ఏఐ-ఇంజిన్ ఆన్-డివైస్ ఏఐ ద్వారా ఆధారంగా పని చేస్తుంది లింక్ బూస్ట్, ఏఐ నోట్ సమ్మరీ, ఏఐ ఆడియో సమ్మరీ వంటి అనేక ఆసక్తికరమైన ఏఐ ఫీచర్లను అందిస్తుంది. ఆక్సిజన్ ఓఎస్, కలర్ ఓఎస్ వంటి అధునాతన ఫీచర్లు ఈ ఫోన్ సొంతం

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5జీ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 29,190గా ఉంది. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ హలో యూఐకు సంబంధించిన స్టాక్‌కు దగ్గరగా ఉంటుంది. ఈ ఫోన్ ఏఐకు సంబంధించిన చాలా సూక్ష్మమైన అప్లికేషన్‌తో వస్తుంది. ఇప్పటివరకు ఎడ్జ్ 50 ప్రోలోని ఏఐ ప్రాసెసింగ్‌ను మెరుగుపరచడానికి, అలాగే వీడియోలను స్థిరీకరించడానికి ఉపయోగించవచ్చు.

పోకో ఎక్స్ ప్రో స్మార్ట్ ఫోన్ 8జీబీ +256 జీబీ మోడల్ ధర రూ. 29,190 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ అండర్-ది-హుడ్ ఏఐ ఆప్టిమైజేషన్‌లతో వస్తుంది. ఈ ఫోన్‌లో ఏఐ-ఆధారిత పనితీరు మెరుగుదల (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, థ్రెడ్ నిర్వహణ, వినియోగ దృశ్యాల ఆధారంగా ఉష్ణోగ్రత నియంత్రణ), ఏఐ -ఆధారిత సూపర్ రిజల్యూషన్ రెండరింగ్ (విజువల్స్‌లో అప్‌స్కేల్) విజువల్స్‌తో వస్తుంది.

రియల్ మీ జీటీ 6టీ ఫోన్ 8జీబీ+128 జీబీ మోడల్ ధర రూ. 29,440గా ఉంది. ఈ ఫోన్ నెక్స్ట్ ఏఐ ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ చాలా పర్‌ఫెక్ట్‌గా చేస్తుంది. ఏఐ ప్రొటెక్షన్ డిస్‌ప్లే, పార్టీ ట్రిక్స్ (ఎయిర్ గెస్టర్స్) వంటి ఫీచర్లు ఆకర్షిస్తాయి.

వివో వీ40ఈ ఫోన్ 8జీబీ +128 జీబీ వేరియంట్ ధర రూ. 26,999 నుంచి ప్రారంభమవుతుంది. ఫోటోగ్రఫీని ప్రధానంగా మెరుగుపరచడానికి ఏఐని ఉపయోగిస్తోంది. ముఖ్యంగా పోర్ట్రెయిట్ మోడల్‌లో తీసిని ఫొటోలను కూడా ఎడిట్ చేసే ఫీచర్ ఆకట్టుకుంటుంది. నెట్‌వర్క్ పనితీరుతో పాటు కాల్స్ అనుభవాన్ని మెరుగుపర్చేందుకు ఏఐ సాయం చేస్తుంది.




