EPF Deposits: ఆ సమావేశంపైనే ప్రైవేట్ ఉద్యోగుల ఆశలు.. కేంద్రం శుభవార్త చెప్పనుందా?
భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఉద్యోగులు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఈపీఎఫ్ఓ ద్వారా ప్రత్యేక పథకాన్ని అందుబాటులో ఉంటుంది. బయట అందించే పథకాల కంటే ఈపీఎఫ్ఓ ద్వారా కేంద్రం అధిక వడ్డీ అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28న నిర్వహించే సీబీటీ సమావేశం ద్వారా మళ్లీ వడ్డీ రేట్లను సవరించనున్నారు.

వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అందించే సేవలను ఆధునికీకరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) కోసం ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి ఈపీఎఫ్ఓకు సంబంధించిన యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఫిబ్రవరి 28న సమావేశమవుతుంది. సీబీటీ సమావేశం ప్రతి త్రైమాసికంలో నిర్వహిస్తూ ఉంటారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి అధ్యక్షతన ఏర్పడిన సీబీటీలో ఉద్యోగి సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే సీబీటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా అదే రేటును కొనసాగించేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించడానికి ముందు ఫిబ్రవరి 28న సీబీటీ ఆమోదించాల్సి ఉంటుంది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుతం 8.25 శాతం అందించే ఈ రేటు గత మూడు సంవత్సరాలలో ఈపీఎఫ్ఓ అందించే అత్యధిక వడ్డీ రేటుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు 8.15 శాతం అందించగా, ఇటీవలి కాలంలో అత్యల్ప రేటు 2021-22లో 8.10 శాతమే అందించింది. గత దశాబ్దం కాలంలో ఈపీఎఫ్ఓ తరచుగా వడ్డీ రేట్లను మారుస్తోంది 2010-11లో అత్యధికంగా 9.50 శాతం వడ్డీ రేటును అందించింది. 2019- 2021 మధ్య వడ్డీ రేట్లు 8.50% వద్ద స్థిరంగా ఉన్నాయి. కోట్లాది మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు రాబడిలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై స్థిర వడ్డీ రేటును అందించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రభుత్వం ప్రస్తుతం వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్‌ను సృష్టించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాబట్టి ప్రస్తుత త్రైమాసికంలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 సూచికలను అనుకరించే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా ఈపీఎఫ్ఓ క్రమం తప్పకుండా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెడుతుంది. ఈపీఎఫ్ఓ ఇటీవల ఈపీఎఫ్ఓ 3.0 ను ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి అమలు చేయనున్న కొత్త ఈపీఎఫ్ఓ సిస్టమ్‌లో ప్రధాన అప్‌గ్రేడ్‌గా ఉంటుంది. ప్రస్తుతం కోటి కంటే ఎక్కువ మంది ఈపీఎఫ్ సభ్యులకు సేవలను అందించే విధానంలో ఈపీఎఫ్ఓ 3.0 కొన్ని ప్రధాన మార్పులను నిర్ధారిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








