AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణాలపై వడ్డీ ఉండదా..? క్లారిటీ ఇచ్చిన పీఐబీ..!

Fact Check: సోషల్‌ మీడియాతో ప్రతి రోజు ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. కొందరు ఫేక్‌ న్యూస్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఎంతో మంది నమ్మి మోసపోతున్నారు. ఇ...

Fact Check: కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణాలపై వడ్డీ ఉండదా..? క్లారిటీ ఇచ్చిన పీఐబీ..!
Subhash Goud
|

Updated on: Apr 07, 2022 | 8:22 AM

Share

Fact Check: సోషల్‌ మీడియాతో ప్రతి రోజు ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. కొందరు ఫేక్‌ న్యూస్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఎంతో మంది నమ్మి మోసపోతున్నారు. ఇక మరో వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచి కిసాన్‌ క్రెడిట్‌ క్రెడిట్ కార్డ్‌పై ఎలాంటి వడ్డీ వసూలు చేయబడదని సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2022-23 మొదటి రోజు నుండి అంటే ఏప్రిల్ 1 నుండి కిసాన్‌ క్రెడిట్‌కార్డుపై వడ్డీ ఉండదని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇలాంటివి నమ్మవద్దని తెలిపింది. భారత ప్రభుత్వ పత్రికా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్‌ అవుతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద వడ్డీ లేని రుణం ఇస్తున్నారని వస్తున్న వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇదంతా అబద్దమని, ఇలాంటివి నమ్మవద్దని పీఐపీ సూచించింది.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు స్కీమ్‌ కింద గత రెండేళ్లలో 2.92 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం కిసాన్‌ క్రెడిట్‌ కార్డును జారీ చేసింది. దీనిపై తీసుకున్న రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణాలపై వడ్డీరేటు 7 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు. ఇందులో 2 శాతం సబ్సిడీ ఇస్తుంది. అసలు మొత్తం, వడ్డీని సకాలంలో తిరిగి చెల్లిస్తే అందులో 3 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యే వార్తలను నమ్మవద్దని సూచించింది. రైతులు కేసీసీపై రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. ప్రస్తుతం రైతులు 4 శాతం వడ్డీ చెల్లించాలి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై రూ.16,000 కోట్ల అదనపు భారం పడనుంది. ఇక అసత్యపు వార్తలపై స్పష్టత ఇస్తూ, కేంద్ర ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తెలిపింది. KCC కింద వడ్డీ లేని రుణం ఇస్తామన్న వాదన నకిలీదని స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాలు, ఇతర వాటిపై సోషల్‌ మీడియాలో ప్రతి రోజు తప్పుడు సమాచారాలు వస్తుంటాయి. దీంతో ఫ్యాక్ట్‌ చెక్‌ ఎప్పటికప్పుడు తనిఖీ చేసి నిజాలను వెల్లడిస్తుంటుంది.

కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడం ఎలా..?

కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడానికి మార్గం సులభం. ముందుగా, మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (pmkisan.gov.in) వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఇక్కడ డౌన్‌లోడ్ కిసాన్ క్రెడిట్ ఫారమ్ ఆప్షన్ ఫార్మర్స్ కార్నర్‌లో కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాన్ని పూర్తిగా పూరించాలి. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఫోటోకాపీని జత చేయండి. అఫిడవిట్ కూడా పెట్టండి. తర్వాత వెరిఫై అయిన తర్వాత కార్డు పొందుతారు.

ఇవి కూడా చదవండి:

Investment Tips: స్టాక్స్‌లో ఇన్వెస్ట్ బ్రోకరేజ్ కంపెనీల రిపోర్టులను నమ్మవచ్చా..? వాటి ఆధారంగా పెట్టుబడులు పెట్టొచ్చా..?

ELSS Investment: పన్ను ఆదాకోసం ELSS పెట్టుబడులు సరైన నిర్ణయమేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..