Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్‌ డబ్బును ఎవరెవరు విత్‌డ్రా చేసుకునేందుకు అర్హులు..? ఎలాంటి పత్రాలు కావాలి?

ఉద్యోగస్తుల జీతంలో కొంత భాగం ఖచ్చితంగా ప్రతి నెలా ఉద్యోగుల భవిష్య నిధి (EPF)కి వెళ్తుంది. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ప్రజలు పీఎఫ్‌ డబ్బును ముందుగానే విత్‌డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి కూడా చాలా సార్లు కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొకుండా ఉండేందుకు పీఎఫ్‌ డబ్బును..

EPFO: పీఎఫ్‌ డబ్బును ఎవరెవరు విత్‌డ్రా చేసుకునేందుకు అర్హులు..? ఎలాంటి పత్రాలు కావాలి?
Epfo
Follow us
Subhash Goud

|

Updated on: Jun 04, 2023 | 9:52 PM

ఉద్యోగస్తుల జీతంలో కొంత భాగం ఖచ్చితంగా ప్రతి నెలా ఉద్యోగుల భవిష్య నిధి (EPF)కి వెళ్తుంది. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ప్రజలు పీఎఫ్‌ డబ్బును ముందుగానే విత్‌డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి కూడా చాలా సార్లు కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొకుండా ఉండేందుకు పీఎఫ్‌ డబ్బును ఉపసంహరించుకునే ప్రక్రియ గురించి తెలుసుకోండి.

పీఎఫ్‌ డబ్బును ఎవరు తీసుకోవచ్చు..?

పీఎఫ్‌ని విత్‌డ్రా చేసుకునేందుకు కూడా కొంత అర్హత ఉండాలి. ఈ అర్హత ప్రమాణాల కారణంగా మాత్రమే పీఎఫ్‌ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందు కార్పస్‌లో కనీసం 90 శాతం ఉపసంహరించుకోవడానికి మీరు అర్హులు. ఒక నెల నిరుద్యోగం తర్వాత మీరు ఫండ్‌లో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగి ఉద్యోగం పొందిన తర్వాత మిగిలిన మొత్తం కొత్త EPFకి బదిలీ చేయబడుతుంది. – మీరు తప్పనిసరిగా UAN నంబర్‌ కలిగి ఉండాలి. ఈపీఎఫ్‌ నుంచి డబ్బును విత్‌డ్రా చేయడానికి ఆధార్, పాన్‌తో సహా మీ బ్యాంక్ వివరాలను తప్పనిసరిగా మీ యూఏఎన్‌కి లింక్ చేయాలి.

ప్రజలు ఈపీఎఫ్‌ ఉపసంహరించుకోవడానికి కింది పత్రాలను సమర్పించాలి?

  • దరఖాస్తుదారు కేవైసీ పత్రాల ధృవీకరించిన ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం.
  • రద్దు చేయబడిన చెక్కు లేదా బ్యాంక్ పాస్‌బుక్, దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతా వివరాలను ధృవీకరించడానికి ఉపయోగించే ఏదైనా ఇతర పత్రాలు.
  • ఉద్యోగి 5 సంవత్సరాల నిరంతర సర్వీసుకు ముందు ఈపీఎఫ్‌ని ఉపసంహరించుకుంటే ఐటీఆర్‌ ఫారం 2, ఐటీఆర్‌ ఫారం 3 అవసరం.
  • బ్యాంక్ ఖాతా వివరాలు

గమనిక:

ఆన్‌లైన్‌లో మీ EPF ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయడానికి మీ మొబైల్ నంబర్‌ను మీ ఆధార్ కార్డ్ నంబర్‌తో లింక్ చేయాలి. అప్పుడు ఉపసంహరణలు ఆన్‌లైన్‌లో సులభంగా చేయవచ్చని గమనించండి. ధృవీకరణ కోసం మీరు మీ మునుపటి యజమాని లేదా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి