- Telugu News Photo Gallery From PAN Aadhaar linking to advance tax payment, check key personal finance deadlines in June 2023
PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానానికి సమయం దగ్గర పడుతోంది మిత్రమా.. ఇదే లాస్ట్ చాన్స్..!
ఈ రోజుల్లో పాన్‌కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరైపోయింది. బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు జరిపే వరకు పాన్‌కార్డు తప్పనిసరి. బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించాలంటే ఆధార్, పాన్ కార్డు సమర్పించాల్సిందే. వాటిని అనుసంధానం చేయాలని ఇంతకుముందే ఆదాయం పన్ను విభాగం, కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేశాయి..
Updated on: Jun 04, 2023 | 8:32 PM

ఈ రోజుల్లో పాన్‌కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరైపోయింది. బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు జరిపే వరకు పాన్‌కార్డు తప్పనిసరి. బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించాలంటే ఆధార్, పాన్ కార్డు సమర్పించాల్సిందే. వాటిని అనుసంధానం చేయాలని ఇంతకుముందే ఆదాయం పన్ను విభాగం, కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేశాయి.

తాజాగా ఆధార్-పాన్ కార్డు అనుసంధానానికి జూన్ నెలాఖరు వరకు గడువు పొడిగించింది ఐటీ విభాగం. గడువులోగా అనుసంధానించకుంటే పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అలా ఇన్-యాక్టివ్ అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో, స్టాక్స్‌లో ఖాతాలు ఓపెన్ చేయలేరు. అలాగే ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేరు.

ఆదాయం పన్ను చట్టం-1961లోని 272బీ సెక్షన్ కింద రూ.10 వేల పెనాల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా.. ఆదాయం ఆధారంగా అధిక పన్ను పే చేయాల్సి రావచ్చు.

కానీ చాలా మందికి పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం ఎలా, ఎక్కడ చేయాలో తెలియని పరిస్థితి. ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో ఉచితంగా పాన్ కార్డు-ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.

ఇప్పటికీ పాన్ కార్డు-ఆధార్ అనుసంధానించకుంటే ఈ నెలాఖరు వరకు రూ.1000 పెనాల్టీ ఛార్జీ చెల్లించి అనుసంధానం చేసుకోవాలి. అందుకు ఆదాయం పన్ను అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాటిని లింక్ చేయాలి.





























