Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడదా.? సోమవారం మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..
Petrol Diesel Price: దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరగడం తప్ప తగ్గడం తెలియదన్నట్లు దూసుకుపోతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. ఇక పరిస్థితి...
Petrol Diesel Price: దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరగడం తప్ప తగ్గడం తెలియదన్నట్లు దూసుకుపోతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకో వారంలో హైదరాబాద్‌లోనూ పెట్రోల్ ధర వంద దాటేలా కనిపిస్తోంది. ఇక డీజీల్ కూడా పెట్రోల్‌తో పోటీ పడీ మరీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సోమవారం ప్రధాన నగరాల్లో నమోదైన పెట్రోల్, డీజిల్ ధరలపై ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని ఢిల్లీలో..
లీటర్ పెట్రోల్ రూ. 94.76 (ఆదివారం రూ. 94.49 ) లీటర్ డీజిల్ రూ. 85.66 (ఆదివారం రూ. 85.38 )
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో..
లీటర్ పెట్రోల్ రూ. 100.98 (ఆదివారం రూ. 100.72 ) లీటర్ డీజిల్ రూ. 92.99 (ఆదివారం రూ. 92.69 )
* చెన్నైలో సోమవారం ఇంధన ధరలు ఇలా ఉన్నాయి..
లీటర్ పెట్రోల్ రూ. 96.23 (ఆదివారం రూ. 96.08 ) లీటర్ డీజిల్ రూ. 90.38 (ఆదివారం రూ. 90.21 )
* బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు..
లీటర్ పెట్రోల్ రూ. 97.92 (ఆదివారం రూ. 97.64 ) లీటర్ డీజిల్ రూ. 90.81 (ఆదివారం రూ. 90.51 )
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తో..
* హైదరాబాద్‌లో ధరలు..
లీటర్ పెట్రోల్ రూ. 98.48 (ఆదివారం రూ. 98.20 ) లీటర్ డీజిల్ రూ. 93.38 (ఆదివారం రూ. 93.08 )
* ఆదిలాబాద్‌లో పెట్రోల్ రూ. వంద దాటేసింది.. ఇక్కడ ధరలు ఇలా ఉన్నాయి..
లీటర్ పెట్రోల్ రూ. 100.45 (ఆదివారం రూ. 100.25 ) లీటర్ డీజిల్ రూ. 95.20 (ఆదివారం రూ. 94.98 )
* విజయవాడలోనూ పెట్రోల్ వంద దాటేసింది.. ఇక్కడ ధరలు..
లీటర్ పెట్రోల్ రూ. 100.89 (ఆదివారం రూ. 100.73 ) లీటర్ డీజిల్ రూ. 95.19 (ఆదివారం రూ. 95 )
* సాగర నగరం విశాఖలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..
లీటర్ పెట్రోల్ రూ. 99.90 (ఆదివారం రూ. 100.09 ) లీటర్ డీజిల్ రూ. 94.23 (ఆదివారం రూ. 94.36 )
Also Read: Differences in Milk : ఆరోగ్యానికి ఆవుపాలు మంచివా.. గేదె పాలు మంచివా..! రెండింటి మధ్య తేడాలు ఏంటి..?