Differences in Milk : ఆరోగ్యానికి ఆవుపాలు మంచివా.. గేదె పాలు మంచివా..! రెండింటి మధ్య తేడాలు ఏంటి..?

Differences in Milk : పాలు తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. పాలల్లో ఎన్నో రకాలు అయిన పోషకాలు నిండుగా

Differences in Milk : ఆరోగ్యానికి ఆవుపాలు మంచివా.. గేదె పాలు మంచివా..! రెండింటి మధ్య తేడాలు ఏంటి..?
Differences In Milk
Follow us
uppula Raju

|

Updated on: Jun 07, 2021 | 6:13 AM

Differences in Milk : పాలు తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. పాలల్లో ఎన్నో రకాలు అయిన పోషకాలు నిండుగా ఉంటాయి. ప్రతి రోజు పాలు తాగడం వలన బలం వస్తుంది. ఇందులో విటమిన్ డీ, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా చేయడంలో సహాయపడతాయి. అయితే చాలామందిలో ఒక డౌట్ ఉంటుంది అదేంటంటే మన ఆరోగ్యానికి ఆవు పాలు మంచివా? లేక గేదె పాలు మంచివా? అనే అయోమయంలో ఉంటారు. అసలు ఆవు పాలకు, బర్రె పాలకు మధ్య తేడా ఏంటో ఒకసారి చూద్దాం..

పాల‌ల్లో ఉండే కొవ్వుపై వాటి చిక్కద‌నం ఆధార‌ప‌డి ఉంటుంది. ఆవు పాల‌ల్లో 3-4 శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది. అదే బ‌ర్రె పాలల్లో 7-8 శాతం వ‌ర‌కు కొవ్వు ఉంటుంది. అందుకే ఆవు పాల కంటే బ‌ర్రె పాలు చిక్కగా ఉంటాయి. దీనివ‌ల్ల బ‌ర్రెపాలు అర‌గ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. ఆవు పాల‌తో పోలిస్తే బ‌ర్రె పాల‌ల్లో 10-11 శాతం ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఇవి ఎక్కువ‌గా వేడి నిరోధ‌క‌త‌ను క‌లిగి ఉంటాయి. అందుకే న‌వ‌జాత శిశువులు, వృద్ధుల‌కు బ‌ర్రె పాలు తాగించొద్దని చెబుతుంటారు.

ఆవు పాల‌తో పోలిస్తే బ‌ర్రె పాల‌ల్లో కొలెస్ట్రాల్ త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల ఊబ‌కాయం, ర‌క్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డేవారు ఆవు పాల‌కు బ‌దులు బ‌ర్రె పాలు తాగ‌డం మంచిది. ఆవుపాల‌తో పోలిస్తే బ‌ర్రె పాలల్లోనే కేల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి. కేల‌రీల‌తో పాటు ప్రోటీన్లు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఒక‌ గ్లాస్ బ‌ర్రె పాల‌ల్లో 237 కేల‌రీలు ఉంటే.. ఒక గ్లాస్ ఆవు పాల‌ల్లో 148 కేల‌రీలు మాత్రమే ఉంటాయి. ఆవు పాలు ప‌సుపు, తెలుపు రంగులో ఉంటాయి. అదే బ‌ర్రె పాలు తెలుపు, క్రీమ్ క‌ల‌ర్‌లో ఉంటాయి. బ‌ర్రె పాలల్లోని బీటాకెరోటిన్ రంగులేని విట‌మిన్ ఏగా మారుతుంది. అందుకే బ‌ర్రె పాల‌ల్లో ప‌సుపు రంగు పోతుంది. ఆవు పాలల్లో కూడా బీటాకెరోటిన్ ఉంటుంది. కానీ త‌క్కువ మోతాదులో మాత్రమే ఉంటుంది.‌

Raja Gopal Reddy : రంజుగా మారుతోన్న తెలంగాణ రాజకీయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో 4 గంటల పాటు డీకే అరుణ చర్చలు

Lakshadweep : లక్షద్వీప్ భౌతిక స్వరూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే విధానమది : ప్రధానికి మాజీ ఐఎఎస్ ల లేఖాస్త్రం

Paddy money : వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఏపీ రైతన్నలకు ఉపశమనం.. 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో ధాన్యం సొమ్ము