Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 5 వ్యాయామాలు రెగ్యూలర్‌గా చేయండి..

Weight Loss Tips: శరీరం బరువు పెరుగుతుందంటే.. ఆరోగ్యం విషయాల్లో అనేక మార్పులు సంభవిస్తారు. ఒక్కొక్కటిగా లేని అనారోగ్యాలు

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 5 వ్యాయామాలు రెగ్యూలర్‌గా చేయండి..
Walking
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 07, 2021 | 12:04 AM

Weight Loss Tips: శరీరం బరువు పెరుగుతుందంటే.. ఆరోగ్యం విషయాల్లో అనేక మార్పులు సంభవిస్తారు. ఒక్కొక్కటిగా లేని అనారోగ్యాలు పుట్టుకొస్తుంటాయి. అందుకనే.. బరువు ఎక్కువగా ఉన్న వారు తమ బరువును తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగ్‌ అని, అదని, ఇదనీ ఏవేవో ప్రయోగాలకు తెరలేపుతారు. అయితే, డైటింగ్ కాకుండా.. పూర్తి ఆరోగ్యకరమైన ఆహారం తింటూనే.. అందుకు అవసరమైన శారీరక శ్రమ చేయాలి. అంటే వ్యాయామం కూడా చేయాలని అర్థం. డైట్‌తో పాటు.. కొన్ని రకాల వ్యాయామాలు చేస్తే చాలా సులభంగా బరువు తగ్గించుకునేందుకు వీలు ఉంటుంది. మరి ఆ వ్యాయామాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నడక: ప్రతిరోజూ ఒక గంట పాటు నడవడం వల్ల బరువు తగ్గవచ్చు. నడక అనేది మీకు మరేమీ అవసరం లేని వ్యాయామం. నడవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక స్థితి స్థిమితంగా ఉంటుంది. శరీరంలో రక్తప్రసర మెరుగు పడుతుంది. గంట పాటు నడవడం వల్ల శరీరంలోని కేలరీలు కరిగిపోయి త్వరగా బరువు తగ్గిపోవచ్చు.

క్రీడలు: ఎలాంటి ఆటలైనా ఆడొచ్చు. ఆటలు ఆడటం వల్ల శరీరానికి వ్యాయామం అయినట్లుగా ఉంటుంది. అలా ఫిట్‌నెస్ పొందవచ్చు. కానీ, ప్రస్తుత జీవన శైలిలో ఆటలు ఆడటానికి సమయం ఉండటం లేదు. అయితే, క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ వంటి ఆటలు ఆడేందుకు కొంత సమయం కేటాయించడం చాలా అవసరం. ఈ ఆటలు మిమ్మల్ని మరింత ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

ఈత: శరీర బరువు తగ్గించుకోవడంలో ఈత చాలా కీలకం అని చెప్పొచ్చు. ప్రతీ రోజూ కనీసం అరగంట అయినా ఈత కొట్టాలి. అలా చేయడం ద్వారా చాలా వేగంగా బరువు తగ్గవచ్చు. ఈత కొట్టడం ద్వారా శరీరం అంతటికీ వ్యాయాయం అవుతుంది.

జుంబా: ప్రస్తుతం చాలా మంది జుంబాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జుంబా అధిక బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతంది. జుంబా ఎప్పుడైనా చేయవచ్చు.

స్కిప్పింగ్ : మీరు బయటకు వెళ్లి వ్యాయామం చేయలేకపోతే.. ఇంట్లో ఉండే స్కిప్పింగ్ చేయవచ్చు. స్కిప్పింగ్ వలన చాలా వరకు బరువు తగ్గించుకోవచ్చు.

Also read:

Ask KTR : కేంద్రం అనాలోచిత నిర్ణయాలే కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో జాప్యానికి కారణం.. ‘ఆస్క్ కేటీఆర్‌’‌లో వ్యాఖ్య