Viral Trick: మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా? బాగా అల్లరి చేస్తున్నారా? అయితే ఇలా కట్టడి చేయండి..
Viral Trick: చిన్న పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వారు చేసే అల్లరి ఒకసారి సరదాగా అనిపిస్తే.. మరొకసారి విసుగు తెప్పిస్తుంటుంది.
Viral Trick: చిన్న పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వారు చేసే అల్లరి ఒకసారి సరదాగా అనిపిస్తే.. మరొకసారి విసుగు తెప్పిస్తుంటుంది. దాదాపుగా అయితే.. పిల్లల గొడవ, అల్లరి పనులు తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా పరిణమిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు, అన్నా చెల్లెల్లు ఉంటే పరిస్థితి చెప్పనక్కర్లేదు. పాము, ముంగీస లా నిత్యం తగువులాడుతూనే ఉంటారు. చీటికి మాటికి కొట్టుకుంటారు. అయితే వారిని వారించడం కోసం తల్లిదండ్రులు ఆ పిల్లలను తిట్టడం గానీ, కొట్టడం గానీ చేయాల్సి వస్తుంది. అయితే, ఈ చర్యల వల్ల పిల్లల్లో ఏమాత్రం మార్పు రాకపోగా.. అల్లరి మరింత ముదిరిపోతుంది. అయితే, ఈ పద్దతులకు చరమగీత పాడుతూ ఓ మహిళ తన పిల్లలు కొట్టుకోకుండా ఉండేందుకు సరికొత్త ఉపాయాన్ని కనిపెట్టింది. ఆ ప్లాన్‌ను అమలు చేసి సక్సెస్ కూడా అయ్యింది. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దీక్ష బసు అనే రచయితకు పిల్లలు ఉన్నారు. వారు నిత్యం కొట్టుకునేవారట. అయితే, వీరి అల్లరి భరించలేకపోయిన ఆమె.. వారిని వారించింది, చేయి కూడా చేసుకుంది. అయినా ఫలితం లేకపోవంతో సరికొత్త ఉపాయం ఆలోచించి.. ఆ ప్లాన్‌ను పిల్లలపై అమలు చేసింది. ఆ ప్లాన్ ఏంటంటే.. దీక్ష బసు తన పిల్లలను ఒక చోట కూర్చోబెట్టి ఒక కండీషన్ పెట్టింది. ఇలా నిత్యం కొట్టుకోకుండా.. రోజుకు ఒకసారి చొప్పున ఒకరినొకరు కొట్టుకోవడానికి అనుమతించారు. దాంతో వారు కూడా ఇదేదో బాగుందే అనుకుని రోజంతా ప్రశాంతంగా ఉండి.. రోజులో ఎప్పుడు కొట్టుకొవాలనే దానిపై తెరిపారా చర్చించుకుంటున్నారు. ఈ ప్రయోగంలో వారి గొడవా తగ్గింది. ఆలోచనా శక్తి పెరిగింది అని చెప్పుకొచ్చా దీక్ష బసు.
Viral Tweet:
told my kids they were allowed to hit each other once per day so they should really think it through and not waste their one hit and now they’re calmly discussing when might be the best time to hit each other (but the actual hitting has stopped, I’m a genius)
— Diksha Basu (@dikshabasu) June 2, 2021
Also read: