CM Jagan Delhi tour : కేంద్ర మంత్రుల తీరిక లేని షెడ్యూల్.. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా?
ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవాలని భావించిన ఏపీ సీఎం జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు...

Cm Jagan
AP CM Jagan Delhi tour : ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవాలని భావించిన ఏపీ సీఎం జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. కేంద్ర మంత్రుల తీరిక లేని షెడ్యూల్ కారణంగా జగన్ పర్యటన వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో వ్యాక్సినేషన్ పై తన బాణీని కేంద్రానికి వినిపించాలని సీఎం జగన్ భావించారని, దాంతోపాటే రాష్ట్రానికి చెందిన పలు అభివృద్ధి పనులు, విభజన హామీలపైనా కేంద్రంతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళుతున్నారని వైసీపీ వర్గాలు చెప్పుకొచ్చాయి. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అవుతారని కథనాలు వచ్చాయి. అయితే సీఎం జగన్ ఈ నెల 10న ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.