AP Residential School Notification: ఆంధ్రప్రదేశ్‌లోని గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల..

AP Residential School Notification 2021-2022: ఆంధ్రప్రదేశ్‌లోని గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల..

AP Residential School Notification: ఆంధ్రప్రదేశ్‌లోని గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల..
Apply
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 06, 2021 | 9:32 PM

AP Residential School Notification 2021-2022: ఆంధ్రప్రదేశ్‌లోని గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 38 సాధారణ, 12 మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంస్థ కార్యదర్శి ఎంఆర్ ప్రసన్న కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. విద్యార్థులు 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. నేటి నుంచే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చారు. https.aprs.apcfss.in అనే వెబ్ సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పూర్తయిన తరువాత జిల్లాల వారీగా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేస్తారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

గురుకులాల్లో ప్రవేశానికి అర్హతలేంటంటే.. గురుకులాల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలను అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం.. ఓసీ, బీసీ లకు చెందిన విద్యార్థులు 2010 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య పుట్టిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు 2008 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలి. ఇక గురుకులాల్లో ప్రవేశాలు కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆయా జిల్లాల్లో 2019–20, 2020–21 విద్యాసంవత్సరాల్లో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4 తరగతులు చదివి ఉండాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చదివినా గురుకులాల్లో ప్రవేశానికి అర్హులే. ఓసీ, బీసీ విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోనే చదవి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సరదాయం రూ. లక్ష మించరాదు.

Also read:

Sanjay Dutt meets Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్