AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Corona Updates: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా రోజు వారీగా నమోదవుతున్న కరోనా..

Telangana Corona Updates: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..
Corona
Shiva Prajapati
|

Updated on: Jun 06, 2021 | 8:53 PM

Share

Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా రోజు వారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇవాళ గణనీయంగా తగ్గింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 97,751 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. వీరిలో 1,436 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో కొందరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. మరికొందరు హోం ఐసోలేషన్‌లో ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక 24 గంటల్లో రాష్ట్రం వ్యాప్తంగా 3,614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ప్రస్తుతం 27,016 యాక్టీవ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో దాదాపు చాలా మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.85 శాతం ఉండగా.. మరణాల రేటు 0.57శాతం ఉంది.

కాగా, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం నాడు విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. తెలంగాణలో ఇప్పటి వరకు 5,91,170 మంది కరోనా బారిన పడగా.. 5,60,776 మంది కోలుకున్నారు. ఇక కరోనా వైరస్ ప్రభావంతో 3,378 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమైంది మొదలు ఇప్పటి వరకు 1,58,61,242 శాంపిల్స్ పరీక్షించారు. ఇక తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోనే నమోదు అయ్యాయి.

జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు పరిశీలిస్తే… ఆదిలాబాద్ – 7, భద్రాద్రి కొత్తగూడెం – 89, జీహెచ్ఎంసీ – 184, జగిత్యాల – 32, జనగాం – 17, జయశంకర్ భూపాలపల్లి – 34, జోగులాంబ గద్వాల – 24, కామారెడ్డి – 0, కరీంనగర్ – 67, ఖమ్మం – 148, కొమురం భీం ఆసిఫాబాద్ – 7, మహబూబ్‌నగర్ – 39, మహబూబాబాద్ – 49, మంచిర్యాల – 39, మెదక్ – 8, మేడ్చల్ మల్కాజిగిరి – 71, ములుగు – 27, నాగర్ కర్నూల్ – 19, నల్లగొండ – 118, నారాయణపేట్ – 11, నిర్మల్ – 6, నిజామాబాద్ – 14, పెద్దపల్లి – 44, రాజన్న సిరిసిల్ల – 18, రంగారెడ్డి – 78, సంగారెడ్డి – 39, సిద్దిపేట్ – 42, సూర్యాపేట – 64, వికారాబాద్ – 31, వనపర్తి – 19, వరంగల్ రూరల్ – 27, వరంగల్ అర్బన్ – 54, యాదాద్రి భువనగిరి – 10 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Also read:

యూపీలో మూడు జిల్లాలు మినహా అన్ని చోట్ల కోవిద్ కర్ఫ్యూ ఎత్తివేత… సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడి

Follow Us
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?