డేరా సచ్చా సౌదా చీఫ్ గురుమీత్ రామ్ రహీం సింగ్ కి కోవిద్-19 పాజిటివ్…..ఆసుపత్రికి తరలింపు
డేరా సచ్చా సౌదా చీఫ్.. తనను తాను 'అవతార పురుషుడు'గా ప్రకటించుకున్న గురుమీత్ రామ్ రహీం సింగ్ కోవిద్-19 పాజిటివ్ కి గురయ్యాడు. ఆయనను ఆదివారం మధ్యాహ్నం వెంటనే ఆసుపత్రికి తరలించారు. హర్యానా రోహతక్ జిల్లాలోని సునారియా జైల్లో
డేరా సచ్చా సౌదా చీఫ్.. తనను తాను ‘అవతార పురుషుడు’గా ప్రకటించుకున్న గురుమీత్ రామ్ రహీం సింగ్ కోవిద్-19 పాజిటివ్ కి గురయ్యాడు. ఆయనను ఆదివారం మధ్యాహ్నం వెంటనే ఆసుపత్రికి తరలించారు. హర్యానా రోహతక్ జిల్లాలోని సునారియా జైల్లో ఆయన శిక్ష అనుభవిస్తున్న సంగతి విదితమే.. రేప్, మర్డర్ ఆరోపణలపై ఆయనకు 20 ఏళ్ళ జైలు శిక్ష పడింది. కడుపు నొప్పి ఉందని చెప్పడంతో ఈ నెల 3 న ఆయనకు రోహతక్ లోని ఆసుపత్రిలో టెస్టులు నిర్వహించారు. కానీ తాను కోవిద్ టెస్ట్ చేయించుకోనని ఆయన మొండికేశాడు. దీంతో తదనంతర పరీక్షలకు గాను గురుమీత్ రామ్ రహీం సింగ్ ని గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి గట్టి పోలీసు బందోబస్తు మధ్య తీసుకుపోయారు. సిటీ స్కాన్ మొదలైన పరీక్షలను చేసినట్టు ఓ అధికారి తెలిపారు. గత మే నెలలో కూడా అస్వస్ధతకు గురైన ఈయనను ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేయించగా ఆ మరునాడే డిశ్చార్జ్ అయ్యాడు. తన డేరా (ఆశ్రమం) లో 2017 ఆగస్టులో ఇద్దరు మహిళా భక్తులపై రేప్ కు పాల్పడ్డాడన్న ఆరోపణలపైనా, సిర్సాకు చెందిన ఓ జర్నలిస్టును హత్య చేశాడన్న అభియోగంపైనా ఇతనికి యావజ్జీవ శిక్షతో బాటు మొత్తం 20 ఏళ్ళ జైలు శిక్ష పడింది. కాగా నాడు తమ గురువును పోలీసులు అరెస్టు చేయకుండా చూసేందుకు ఒకనాడు డేరాలోని ఈయన శిష్యులంతా వారిపైనే తిరగబడ్డారు.
కోట లాంటి ఆ ఆశ్రమంపై దాడి చేసేందుకు పోలీసులే వెనుకంజ వేశారు. చివరకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రావడంతో ఆయన శిష్యులు చాలామంది పారిపోయారు.
మరిన్ని ఇక్కడ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏనుగు వింత చేష్టలు..నీరు త్రాగేందుకు కూడా సోమరితనాన్ని ప్రదర్శిస్తున్న గజరాజు..:Elephant Viral Video