AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yamuna River: మంచు దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తున్న పవిత్ర యమున .. దీనికారణం తెలిస్తే షాక్ తినడం కాయం

Yamuna River: భారత దేశంలో ముఖ్యంగా హిందూ సంప్రదయంలో నదులను దేవతలుగా భావిస్తారు. భక్తితో పూజిస్తారు. అయితే మారుతున్న కాలంతో పాటు..

Yamuna River: మంచు దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తున్న పవిత్ర యమున .. దీనికారణం తెలిస్తే షాక్ తినడం కాయం
Yamuna River
Surya Kala
|

Updated on: Jun 06, 2021 | 7:53 PM

Share

Yamuna River: భారత దేశంలో ముఖ్యంగా హిందూ సంప్రదయంలో నదులను దేవతలుగా భావిస్తారు. భక్తితో పూజిస్తారు. అయితే మారుతున్న కాలంతో పాటు.. మారుతున్న అలవాట్లు.. పెరుగుతున్న ఆధునిక జీవిత విధానంతో నదులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. ఎన్నో ప్రభుత్వాలు నదులను కాలుష్య కోరలనుంచి రక్షిస్తామని.. వాటిలోని కాలుష్యాన్ని తగ్గించి పవిత్ర జలంగా తిరిగిమారుస్తామని ఎన్నికల హామీలుగా ఇస్తున్నాయి. అయినప్పటికీ ఆ హామీలు కార్య రూపం దాలుస్తున్నాయా అంటే.. యక్ష ప్రశ్నగానే మిగిలిపోతుంది.

తాజాగా గంగానదికి ఉపనది ఐన యమున తెల్లటి నురగలో కనిపించింది. అయితే అది మంచు దుప్పటి కాదు.. సబ్బు నురగ కాదు.. మురికి నీరు యములో వదలడంతో వచ్చిన నురగలో యమునా నది అలా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు యమునా నది నీరు ప్రమాదకరంగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోజు రోజుకీ దేశ రాజధాని హస్తినలో వాయు కాలుష్యంతో పాటు నీటి కాలుష్యం కూడా ఎక్కువ అవుతూ.. ఆందోళన కలిగిస్తుంది. ఢిల్లీ చుట్టు పక్కల వివిధ ప్రాంతాల్లో చిన్న పెద్ద అనేక పరిశ్రలున్నాయి. వీటి నుంచి వెలువడే వ్యర్థాలు, మురికినీరు యమునా నదిలోకి చేరుతుంది. దీంతో నదిలోని నీరు కలుషితమవుతోంది. విష రసాయనాల కారణంగా..యమునా నదిలో విషపు నురుగులు పేరుకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కలింది కుంజ్ ఏరియాలో యమునా నదిపై విషపు నురుగు దర్శనమిచ్చింది.

నిజానికి యమునా నదిలో స్నానం చేస్తే అప మృత్యు దోషం తొలగుతుంది పురాణాల కథనం.. మన పెద్దల నమ్మకం. ఇప్పుడున్న యమున లో స్నానం చేస్తే.. అకాల మృత్యుదోషం తొలగడం మాట అటుంచి.. వింత రోగాలతో మనుషులు బాధపడడం ఖాయం అని అంటున్నారు కొందరు. ఇప్పటికే యమున నది అత్యంత కాలుష్య నదిగా మారిపోయిందని.. దీంతో నది చుట్టుపక్కల పల్లెల్లో భూగర్భ జాలు విషతుల్యమవుతున్నాయని, ఫలితంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. అయినప్పటికీ యమునా నదిపై ఉన్న భక్తితో పుణ్యస్నానాలు, సంధ్య వారుస్తుంటారు.

ఢిల్లీలో 22 కిలోమీటర్ల మేర యమునా నది ప్రవహిస్తుంది. యమునా పరీవాహక ప్రాంతాలలో యమునా నగర్, ఢిల్లీ, మధుర, ఆగ్రా, ఇటావా, అలాహాబాద్‌ నగరాలు ఉన్నాయి. హిందువులు పవిత్రంగా భావించే యమునా నదికి కలిష్యం నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో నని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read:   పెంపుడుపాముతో కలిసి నిద్రించిన యజమాని.. ఆ పై తన తన గుణం చూపించిన పాము