Paddy money : వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఏపీ రైతన్నలకు ఉపశమనం.. 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో ధాన్యం సొమ్ము

ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్మి వారాలు దాటుతున్నా ఇప్పటి వరకూ చేతికి చిల్లిగవ్వ కూడా రాలేదని..

Paddy money : వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఏపీ రైతన్నలకు ఉపశమనం..  21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో ధాన్యం సొమ్ము
Kannababu
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 07, 2021 | 12:31 AM

AP minister Kannababu on Paddy money : ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్మి వారాలు దాటుతున్నా ఇప్పటి వరకూ చేతికి చిల్లిగవ్వ కూడా రాలేదని మొరపెట్టుకుంటోన్న రైతన్నలను ఏపీ సర్కారు కరుణించింది. 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో ధాన్యం సొమ్ము వేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో వేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వ్యవ‌సాయశాఖ మంత్రి కుర‌సాల‌ కన్నబాబు స్పష్టం చేశారు.

ఇప్పటివరకూ 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్న ఆయన.. మిల్లర్లు, దళారులను రైతులు నమ్మొద్దని సూచించారు. ఆర్‌బీకేలకు వెళ్లి కనీస మద్దతు ధరకే ధాన్యం విక్రయించుకోవాలన్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న రకాలనే రైతులు సాగు చేయాలని.. అందుకు సంబంధించిన విత్తనాలను కూడా సిద్ధం చేశామని మంత్రి తెలిపారు.

వ్యవసాయ సలహా మండలిలో రైతులను భాగస్వామ్యం చేస్తామని చెప్పిన కన్నబాబు, వ్యవసాయ సలహా మండలి నియామకం పూర్తయిందని పేర్కొన్నారు. ఇక మీదట సలహా మండలితో చర్చించి విధాన నిర్ణయాలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి వెల్లడించారు.

Read also : AP Health : హెల్ప్‌డెస్క్‌లను మరింత మెరుగు పర్చండి.. బ్లాక్‌ ఫంగస్‌కు పూర్తి స్థాయి వైద్యం అందించండి : మంత్రి ఆళ్ల నాని