Raja Gopal Reddy : రంజుగా మారుతోన్న తెలంగాణ రాజకీయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో 4 గంటల పాటు డీకే అరుణ చర్చలు

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారటం మొదలు పెట్టాయి..

Raja Gopal Reddy : రంజుగా మారుతోన్న తెలంగాణ రాజకీయం..  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో 4 గంటల పాటు డీకే అరుణ చర్చలు
DK Aruna
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 07, 2021 | 1:07 AM

DK Aruna meets Raja gopal Reddy : తెలంగాణ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఈటెలను మంత్రి వర్గం నుంచి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేయడం, తదనంతర పరిణామాలు ఒకెత్తయితే, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డితో భేటీ కావడం ఇప్పుడు తెలంగాణ గడ్డమీద హాట్ టాపిక్ అయింది. ఇవాళ ఇరువురి నేతల మధ్య దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా డీకే అరుణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు.

అయితే, కొంత సమయం కావాలన్న రాజగోపాల్ రెడ్డి.. త్వరలో తన నిర్ణయాన్ని చెప్తానని డీకే అరుణకు తెలిపారు. కాగా, ఇటీవల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కూడా భేటీ అయి.. ఆయన్ను కూడా డీకే అరుణ బీజేపీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈటల కూడా బీజేపీ బాట పట్టబోతుండటంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి.

Read also : Lakshadweep : లక్షద్వీప్ భౌతిక స్వరూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే విధానమది : ప్రధానికి మాజీ ఐఎఎస్ ల లేఖాస్త్రం