AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: మీ వివాహం కోసం పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి

గత కొన్నేళ్లుగా పర్సనల్ లోన్ల ట్రెండ్ బాగా పెరిగింది. డబ్బు అవసరమైనప్పుడల్లా నగదు అందుబాటులో ఉండడమే ఇందుకు కారణం. భారతదేశంలో ఆడంబరంగా..

Personal Loan: మీ వివాహం కోసం పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
Personal Loan
Subhash Goud
|

Updated on: Mar 06, 2023 | 12:42 PM

Share

గత కొన్నేళ్లుగా పర్సనల్ లోన్ల ట్రెండ్ బాగా పెరిగింది. డబ్బు అవసరమైనప్పుడల్లా నగదు అందుబాటులో ఉండడమే ఇందుకు కారణం. భారతదేశంలో ఆడంబరంగా పెళ్లి చేసుకోవడం పెద్ద ప్రాజెక్ట్. చాలా సన్నాహాలు చేయాల్సి ఉంటుంది. చాలా పనులు ఉన్నాయి. దీని వల్ల చాలా మందికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంబది. అందువల్ల వివాహ ఖర్చులన్నింటినీ సులభంగా తీర్చుకోవడానికి వ్యక్తిగత రుణాన్ని తీసుకోండి. అలాగే పెళ్లి కోసం భారీ మొత్తాన్ని వెచ్చించాలనే ఆందోళన నుండి విముక్తి పొందవచ్చు.

వివాహానికి వ్యక్తిగత రుణాన్ని ఎలా ఎంచుకోవాలి..?

1. వారు ఎటువంటి పూచీకత్తును అందించాల్సిన అవసరం లేదు:

వివాహానికి వ్యక్తిగత రుణం ఒకటి. దీనికి ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు. అంటే మీ ఆస్తులు ఏ మాత్రం రిస్క్‌లో పడకుండానే మీకు అవసరమైన మొత్తాన్ని మీరు పొందవచ్చు. సెక్యూరిటీని అందించాల్సిన అవసరం లేనందున ఇతర రుణాలతో పోలిస్తే వివాహానికి వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేయడం సులభం.

2. లోన్ రీపేమెంట్ వ్యవధిలో సౌలభ్యం:

పర్సనల్ లోన్ రీపేమెంట్ వ్యవధి రుణదాతపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కాల వ్యవధి 12 నెలల నుండి 84 నెలల వరకు ఉంటుంది. ఖర్చులు, నెలవారీ ఆదాయం ఆధారంగా మీరు మీ స్వంత రుణ చెల్లింపు ప్రణాళికను రూపొందించుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు మీరు నెలవారీ ఎంత చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి మీరు పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు లోన్ మొత్తం పదవీకాలం, వడ్డీ రేటును నమోదు చేయండి. ఈ కాలిక్యులేటర్ ద్వారా నెలవారీ చెల్లింపు ఎంత అనేది తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

3. చాలా తక్కువ పత్రాలతో దరఖాస్తు చేయడం సులభం:

పెళ్లి కోసం పర్సనల్ లోన్‌ను అప్లై చేయడం, పొందడం చాలా సులభం.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడు చాలా పత్రాలు అవసరం లేదు. మీరు రుణదాత వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో కొన్ని క్లిక్‌లతో ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

4. అర్హత పొందడం సులభం:

వ్యక్తిగత రుణాలకు ఖచ్చితంగా ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. అలాగే అవసరాలను తీర్చడం సులభం. ఇది తనఖా లేదా కారు రుణం వంటిది కాదు. ఇక్కడ దరఖాస్తు చేయడానికి ముందు పలు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. రుణదాతలు మీ క్రెడిట్ చరిత్ర, లోన్ రీపేమెంట్ సామర్థ్యాన్ని ఖచ్చితంగా తనిఖీ చేస్తారు. కానీ పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడం సులభంగా ఉంటుంది. ఆమోదం సాధారణంగా ఒక రోజు కంటే తక్కువ సమయం పడుతుంది. మీ దరఖాస్తును పరిశీలించిన తర్వాత మొత్తం మీ ఖాతాలో జమ చేయబడుతుంది. పర్సనల్ లోన్‌ అనేది తక్షణమే అందుబాటులో ఉంటుంది.

5. మీ పెట్టుబడులను రీడీమ్ చేయవలసిన అవసరం లేదు:

కొంతమంది వివాహం కోసం వారి ఫిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్‌ చేస్తారు. లేదా వారి పొదుపు డబ్బును ఖర్చు చేస్తారు. ఏదేమైనప్పటికీ, మెచ్యూరిటీ తేదీకి ముందు ఫిక్స్‌డ్ లేదా రికరింగ్ డిపాజిట్‌ను విచ్ఛిన్నం చేయడం అదనపు పెనాల్టీ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయ నష్టానికి కూడా దారితీయవచ్చు. పెళ్లి కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ నుంచి పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా సులభం. దీని కోసం చాలా తక్కువ పత్రాలు అవసరం. ప్రాసెసింగ్ కూడా వేగంగా ఉంటుంది. మీరు ఈ డబ్బును ఏదైనా వివాహ పనికి ఖర్చు చేయవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ మీ వివాహ ఖర్చులను తీర్చడానికి అనువైన ఆప్షన్‌. ఇందులో 35 లక్షల వరకు రుణం పొందవచ్చు. మీరు మీ సౌలభ్యం మేరకు 84 నెలల వరకు తిరిగి చెల్లింపు వ్యవధిని నిర్ణయించుకోవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు రుణాన్ని పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి