Credit Score: క్రెడిట్ స్కోర్ ఎంతుందో తెలుసుకోవడానికి పెరుగుతోన్న ఆసక్తి.. సిబిల్ నివేదికలో ఆసక్తికర విషయాలు..
Credit Score: మారుతోన్న ఆర్థిక స్థితిగతులు, పెరుగుతోన్న టెక్నాలజీ కారణంగా పత్రీ ఒక్కరికీ బ్యాంకింగ్ రంగంపై అవగాహన బాగా పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం కొందరికి మాత్రమే తెలిసిన క్రెడిట్ స్కోర్ అనే పదం...
Credit Score: మారుతోన్న ఆర్థిక స్థితిగతులు, పెరుగుతోన్న టెక్నాలజీ కారణంగా పత్రీ ఒక్కరికీ బ్యాంకింగ్ రంగంపై అవగాహన బాగా పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం కొందరికి మాత్రమే తెలిసిన క్రెడిట్ స్కోర్ అనే పదం ఇప్పుడు అందరికీ సుపరిచమవుతోంది. బ్యాంకింగ్ వినియోగం పెరిగిపోవడం, బ్యాంకులు సైతం రకరకాల ఆఫర్లతో రుణాలు ఇస్తుండడంతో లోన్స్ తీసుకుంటోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ప్రజల్లో క్రెడిట్ స్కోర్ విలువ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా పర్సనల్ లోన్‌లకు సంబంధించిన క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం గత కొన్నేళ్లుగా భారీగా పెరిగినట్లు క్రెడిట్ సమాచార కంపెనీ ట్రాన్స్ యూనియన్ సిబిల్ తెలిపింది. 2017తో పోలిస్తే 2020లో రూ.25,000 దిగువన వ్యక్తిగత రుణాల్లో 23 రెట్ల వృద్ధి నమోదు కాగా.. 2020లో క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం మూడు రెట్లు పెరిగినట్టు పేర్కొంది. ఇక వ్యక్తులు ఉచితంగా క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోవడం పెరిగినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రజల్లో పరపతికి సంబంధించిన అవగాహన పెరిగిందని.. పదే పదే క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకునే వారి సంఖ్య కూడా రెట్టింపు అయినట్లు సిబిల్ నివేదికలో వెల్లడైంది.
Tvs Ntorq 125: నాలుగు రోజుల బంపర్ ఆఫర్.. కేవలం రూ.11,850 చెల్లించి..ఈ స్కూటీ ఇంటికి తీసుకెళ్లండి..
వానొచ్చింది.. రోడ్లపైకి నీరొచ్చింది.. ఆ నీటిలో నడుస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త