Syndicate Bank: మీకు సిండికేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా.? జూలై 1 నుంచి ఇందులో మార్పు జరగనుంది.. గమనించండి.
Syndicate Bank IFSC: మీకు సిండికేట్ బ్యాంకులో అకౌంట్ ఉందా.? అయితే ఈ వార్త మీకోసమే.. జూలై ఒకటో తేదీ నుంచి ఐఎఫ్‌సీ కోడ్‌లు మారనున్నాయి. ఇక నుంచి సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు నెఫ్ట్/ఆర్టీజీఎస్/ఐఎంపీఎస్ ద్వారా జరిగే నగదు లావాదేవీలకు...
Syndicate Bank IFSC: మీకు సిండికేట్ బ్యాంకులో అకౌంట్ ఉందా.? అయితే ఈ వార్త మీకోసమే.. జూలై ఒకటో తేదీ నుంచి ఐఎఫ్‌సీ కోడ్‌లు మారనున్నాయి. ఇక నుంచి సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు నెఫ్ట్/ఆర్టీజీఎస్/ఐఎంపీఎస్ ద్వారా జరిగే నగదు లావాదేవీలకు ఇకపై కెనరా బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను వినియోగించాలని కెనరా బ్యాంక్ ప్రకటన జారీ చేసింది. ఖాతాదారులు కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌ను లేదా, తమ బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించాలని తెలిపారు. ఇక సిండికేట్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారు మారిన కోడ్‌లకు అనుగుణంగా.. కొత్త కోడ్‌లతో కూడిన చెక్ బుక్‌లను తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. విదేశీ లావాదేవీలకు CNRBINBBFD స్విఫ్ట్ కోడ్‌ను వాడాలని ప్రకటన జారీ చేశారు. ఇదిలా ఉంటే ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎందుకు మారిందన్న ప్రశ్న విషయానికొస్తే.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్‌ను విలీనం చేసిన సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ నుంచి కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది. ఈ కారణంగానే సిండికేట్ బ్యాంకు శాఖల్లో ఆన్‌లైన్ లావాదేవీలు, చెక్ లావాదేవీలు మారనున్నాయి.
Also Read: Aadhaar Center: కొత్తగా ఆధార్ సెంటర్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా ? ఎలా ఓపెన్ చేయాలి ? UIDAI సూచనలు..
Insurance Policy: టీకా తీసుకుంటేనే పాలసీ ఇస్తారా?.. కొత్త నిబంధనలు తీసుకువస్తున్న బీమా కంపెనీలు