AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tvs Ntorq 125: నాలుగు రోజుల బంపర్ ఆఫర్.. కేవలం రూ.11,850 చెల్లించి..ఈ స్కూటీ ఇంటికి తీసుకెళ్లండి..

లాక్‌డౌన్ సమయంలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో మారింది. ఇలాంటి సమయంలో వాహన తయారీదారులు కూడా ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీల్ వాహనాలను కూడా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. వాటిపై...

Tvs Ntorq 125: నాలుగు రోజుల బంపర్ ఆఫర్.. కేవలం రూ.11,850 చెల్లించి..ఈ స్కూటీ ఇంటికి తీసుకెళ్లండి..
Tvs Ntorq 125
Sanjay Kasula
|

Updated on: Jun 11, 2021 | 8:39 PM

Share

లాక్‌డౌన్ సమయంలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో మారింది. ఇలాంటి సమయంలో వాహన తయారీదారులు కూడా ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీల్ వాహనాలను కూడా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. వాటిపై మంచి ఆఫర్‌లను కూడా అందిస్తున్నారు. ఈ రోజు మనం అలాంటి ఒక బంపర్ ఆఫర్ గురించి తెలుసుకుందాం. దీనిలో మీరు 12 వేల కన్నా తక్కువ చెల్లించి టీవీఎస్ న్టోర్క్ 125 స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.

వాస్తవానికి టీవీఎస్ ఈ స్టైలిష్ లుకింగ్ స్కూటర్ నో-కాస్ట్ EMIని అందిస్తోంది, దీనిలో మీరు అదనపు వడ్డీ చెల్లించకుండా చౌకైన EMI వద్ద ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్‌లో కంపెనీ 6 నెలల EMI ఆప్షన్‌ను అందిస్తోంది. మీరు జూన్ 15 వరకు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.

ఈ ఆఫర్‌ను మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలో… 

మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే.. దీని కోసం మీరు క్రెడిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు చేయాలి. మీరు TVS ఎన్‌టోర్క్ 125 బేస్ వేరియంట్‌ను 6 నెలల నో-కాస్ట్ EMIలో కొనుగోలు చేస్తే, మీరు నెలకు రూ .11,850 చెల్లించాలి. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ .71,055 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ). ఇందులో, 6 నెలలు కాకుండా, మీరు 3 నెలల EMI ఎంపికను కూడా ఎంచుకోవచ్చు. మీరు TVS మోటార్  వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు మీ పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ మొదలైన వాటితో పాటు వేరియంట్లు, స్టేట్, డీలర్, పిన్‌కోడ్ మరియు ధరలను నమోదు చేయాలి. ఆ తరువాత మీరు నెక్స్ట్ క్లిక్ చేయడం ద్వారా బుక్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ నో కాస్ట్ EMI కాకుండా, మీరు 5,000 రూపాయలతో బుక్ చేసుకొని తరువాత చెల్లించవచ్చు.

TVS Ntorq 125 స్కూటర్ ధర

ప్రస్తుతం ఈ స్కూటర్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది, వీటిలో TVS ఎన్టోర్క్ 125 డ్రమ్ వేరియంట్ ధర రూ .71,055, టివిఎస్ ఎన్టోర్క్ 125 డిస్క్ వేరియంట్ ధర రూ .75,355, TVS నోర్క్ 125 రేస్ ఎడిషన్ ధర 78,335, TVS ఎన్టోర్క్ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ ధర రూ .81,035. . ఈ ధర ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ఇది ప్రతి రాష్ట్రానికి మారుతుంది.

TVS Ntorq 125 ఇంజిన్ & ఫీచర్స్

ఈ స్కూటర్ 124.8 CC సింగిల్ సిలిండర్, ఇంధన-ఇంజెక్ట్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 9 BHP శక్తి, 10.5 NM టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా స్మార్ట్ కనెక్ట్ సిస్టమ్ ఇందులో ఇవ్వబడింది. ఇందులో టాప్ స్పీడ్ రికార్డర్, ఇన్-బిల్ట్ ల్యాప్ టైమర్, నావిగేషన్ అసిస్ట్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, ట్రిప్ మీటర్, రైడ్ స్టాటిక్స్ మోడ్లు.. సర్వీస్ రిమైండర్ మొదలైనవి ఉన్నాయి. మీరు దీన్ని మీ ఫోన్‌కు కూడా కనెక్ట్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి: AP CM Jagan Delhi Tour: విజయవంతంగా సాగిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

Amazing Benefits: పాలలో తేనె కలిపి తాగుతున్నారా..! ఎలాంటి ప్రయోజనాలు.. కలిగే నష్టాలు తెలుసుకోండి..!

Swami Sivanand Baba : కొవిడ్ టీకా తీసుకున్న 125 ఏళ్ల వ్యక్తి..! వ్యాక్సిన్ తీసుకున్న పెద్ద వయస్కుడిగా గుర్తింపు