వానొచ్చింది.. రోడ్ల‌పైకి నీరొచ్చింది.. ఆ నీటిలో న‌డుస్తున్నారా..? త‌స్మాత్ జాగ్ర‌త్త

వర్షాకాలం వచ్చిసింది. జోరు వానలు మొద‌ల‌య్యాయి. వ‌ర‌ద ప్ర‌వాహాలు క‌నిపిస్తున్నాయి. వర్షపు నీరు రకరకాల ప్రదేశాల నుంచి వచ్చి చేరుతుంది. అయితే..

వానొచ్చింది.. రోడ్ల‌పైకి నీరొచ్చింది.. ఆ నీటిలో న‌డుస్తున్నారా..? త‌స్మాత్ జాగ్ర‌త్త
Walking In Rain Water

వర్షాకాలం వచ్చిసింది. జోరు వానలు మొద‌ల‌య్యాయి. వ‌ర‌ద ప్ర‌వాహాలు క‌నిపిస్తున్నాయి. వర్షపు నీరు రకరకాల ప్రదేశాల నుంచి వచ్చి చేరుతుంది. అయితే.. కలుషితమైన వాన నీటిలో నడిస్తే డేంజ‌ర‌స్ లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని ముంబైకి చెందిన ప్రముఖ డాక్ట‌ర్ మంగళ గోమరే తెలిపారు. ఈ వ్యాధి సోకినవారు 24 నుంచి 72 గంటల వ్యవధిలో డాక్ట‌ర్‌ను సంప్రదించాలని సూచించారు. నిల్వ ఉన్న వర్షపు నీటిలో లెప్టోస్పైరా అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీని నుంచి లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వాన నీటిలో ఎలుకలు, కుక్కలు, గేదెలతో పాటు వివిధ ర‌కాల‌ జంతువుల యూరిన్ కలిసి ఉంటుంది. ఎవరైనా ఈ నీటిలో నడిస్తే ఈ వ్యాధి బారిన పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కాళ్లకు ఏమైనా గాయాలైన వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ‌గా ఉంటుంది.

లెప్టోస్పైరోసిస్ వ్యాధి బారిన పడిన వారు.. వెంటనే డాక్ట‌ర్‌ను సంప్రదించకుండా.. నిర్ల‌క్ష్యం చేస్తే మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంది. ఈ వ్యాధి బారిన పడిన గర్భిణీలు, 8ఏళ్లలోపు చిన్నారులు డాక్ట‌ర్ల‌ సలహా మేరకే తగిన మందులు వాడాలి. ఇది అంటు వ్యాధి కాక‌పోవడం ఊర‌ట‌నిచ్చే విష‌యం. లెప్టోస్పైరా అనే సూక్ష్మజీవిని అనేక జంతువులు తీసుకొస్తాయి. ఈ వ్యాధికి ప్రత్యేక వ్యాధి లక్షణాలు ఏమీ ఉండవు.

Also Read: కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి.. పరీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై క్లారిటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 8,239 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా