AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adimulapu Suresh: కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి.. పరీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై క్లారిటీ

ఏపీలో టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై దుమారం కొన‌సాగుతుంది. స‌రైన స‌మ‌యం చూసి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం తేల్చి చెబుతుండ‌గా....

Adimulapu Suresh: కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి.. పరీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై క్లారిటీ
AP Education Minister adimulapu suresh on 10th exams
Ram Naramaneni
|

Updated on: Jun 11, 2021 | 6:09 PM

Share

ఏపీలో టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై దుమారం కొన‌సాగుతుంది. స‌రైన స‌మ‌యం చూసి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం తేల్చి చెబుతుండ‌గా, ప్ర‌తిప‌క్షాలతో పాటు కొంత‌మంది పేరెంట్స్ నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతంది. తాజాగా ఈ అంశంపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో చ‌ర్చించామ‌ని.. ప్ర‌స్తుతం ఎగ్జామ్స్ కండెక్ట్ చేసే ప‌రిస్థితి లేదన్నారు. ఆల్ ఇండియా పరీక్షలకు సిద్ధం అవడానికి కూడా విద్యార్థులకు సమయం కావాల‌న్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు మాత్ర‌మే పరీక్షలు నిర్వహిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎటువంటి భయం లేని సమయంలోనే పరీక్షలు ఉంటాయని తేల్చి చెప్పారు. ప్రైవేట్ యాజమాన్యాలకి మద్దతుగా కొన్ని పార్టీలు పరీక్షలపై రాజకీయం చేస్తున్నాయని మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక తండ్రిగా అయితే తాను పరీక్షల నిర్వహణకు మద్దతిస్తాన‌ని మంత్రి చెప్పారు. ఆప్షన్స్ చూడకుండా ఎగ్జామ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని.. నారా లోకేష్ లాగా అందరూ దొడ్డి దారిలో మంత్రి పదవులు పొందలేరని ఆదిమూల‌పు సురేష్ ఫైర‌య్యారు. లోకేష్ లాగా అందరికి హెరిటేజ్ లాంటి ఆస్తులు లేవని.. ఎవరో సీటు ఇప్పిస్తే ఆయ‌న‌ స్టాన్‌ఫోర్డ్‌లో చదివారని ఆరోపించారు. పరీక్ష రద్దు చేయడానికి ఒక నిమషం పట్టదని.. కానీ తాము విద్యార్థులు భవిష్య‌త్ గురించి ఆలోచిస్తున్నామ‌ని మంత్రి చెప్పారు. కళాశాలల్లో కానీ పాఠశాలల్లో కానీ అడ్మిషన్లు చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా అడ్మిషన్లు ప్రారంభిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి సురేశ్ హెచ్చరించారు.

Also Read:  స్విగ్గీ డెలివరీ బాయ్​గా మారిన‌ ఆడీ ఆర్​8 కార్​ ఓనర్​.. ప్రాంక్ కాదండోయ్

మనిషి మలంతో నిండిన గొయ్యిలో లభ్యమైన 1000 ఏళ్ల నాటి కోడి గుడ్డు.. ఆశ్య‌ర్య‌క‌రంగా అది మురిగిపోలేదు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!