AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8,239 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 1,01,863 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 8,239 పాజిటివ్ కేసులు....
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 1,01,863 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 8,239 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 17,96,122 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 61 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,824కి చేరింది. మరో 11,135 మంది బాధితులు వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,88,198కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 96,100 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,02,39,490 శాంపిల్స్ వైద్యారోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,396 కేసులు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 201 కేసులు వెలుగుచూశాయి.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
#COVIDUpdates: 11/06/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,93,227 పాజిటివ్ కేసు లకు గాను *16,85,303 మంది డిశ్చార్జ్ కాగా *11,824 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 96,100#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/xHo7e6Yckp
— ArogyaAndhra (@ArogyaAndhra) June 11, 2021
దేశంలో కరోనా వివరాలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 91,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,74,823కి చేరింది. ఇందులో 11,21,671 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కొత్తగా 1,34,580 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,77,90,073కి చేరింది. అటు గురువారం 3403 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,63,079కి చేరుకుంది.
Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడు పెంచింది.. తాజా అప్‌డేట్ ఇది