Bank Accounts: అధిక బ్యాంకు అకౌంట్లు ఉంటే జరిమానా బాదుడు..? పీఐబీ క్లారిటీ ఇదే..!

ముఖ్యంగా వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవలను అందుకోవడానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి. వేలాది మంది ప్రజలకు వివిధ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉంటున్నాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అయ్యింది. ఇది ప్రజలలో ఆందోళనకు కారణమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న వ్యక్తులపై ఇప్పుడు జరిమానా విధిస్తారనే వార్త వైరల్‌గా మారింది.

Bank Accounts: అధిక బ్యాంకు అకౌంట్లు ఉంటే జరిమానా బాదుడు..? పీఐబీ క్లారిటీ ఇదే..!
Bank Accounts
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 11, 2024 | 8:34 PM

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన టెక్నాలజీ కారణంగా బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు వచ్చాయి. భారతదేశంలో అయితే అనేక బ్యాంకులు ఉన్న కారణంగా ప్రతి ఒక్కరికీ రెండు నుంచి మూడు బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. ముఖ్యంగా వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవలను అందుకోవడానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి. వేలాది మంది ప్రజలకు వివిధ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉంటున్నాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అయ్యింది. ఇది ప్రజలలో ఆందోళనకు కారణమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న వ్యక్తులపై ఇప్పుడు జరిమానా విధిస్తారనే వార్త వైరల్‌గా మారింది. ఈ వార్త ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తేల్చింది. ఈ నేపథ్యంలో పీఐబీ ఇచ్చిన క్లారిటీ గురించి ఓ సారి తెలుసుకుందాం. 

భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ వైరల్ సందేశం వెనుక ఉన్న వాస్తవాన్ని వెల్లడించింది. కొన్ని కథనాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాను ఉంచినందుకు జరిమానా విధించబడుతుందని ఈ అపోహ వ్యాప్తి చెందుతుందని, ఆర్‌బీఐ అటువంటి మార్గదర్శకాలు ఏవీ జారీ చేయలేదరని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి వైరల్ మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. 

పీఐబీ ఇంటర్నెట్‌లో త్వరగా వ్యాపించే ఇలాంటి వార్తలను ఏజెన్సీ నిరంతరం పర్యవేక్షిస్తుంది. సరైన వాస్తవ తనిఖీ కోసం ఎవరైనా అలాంటి వార్తలను  ప్రజలు పీఐబీకు కూడా పంపవచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా వార్తలు లేదా మార్గదర్శకాలను ధ్రువీకరించడానికి పీఐబీ ఫాక్ట్ చెక్ సేవను కూడా ఉపయోగించవచ్చు. అలా చేయాలనుకునే వ్యక్తి తప్పుదోవ పట్టించే వార్తల స్క్రీన్‌షాట్, ట్వీట్, ఫేస్‌బుక్ పోస్ట్ లేదా యూఆర్ఎల్‌ను పీఐబీ ఫాక్ట్ చెక్ వాట్సాప్ నంబర్ 8799711259కి పంపవచ్చు లేదా factcheck@pib.gov.inకి ఈ-మెయిల్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అధిక బ్యాంకు అకౌంట్లు ఉంటే జరిమానా బాదుడు..?పీఐబీ క్లారిటీ ఇదే..!
అధిక బ్యాంకు అకౌంట్లు ఉంటే జరిమానా బాదుడు..?పీఐబీ క్లారిటీ ఇదే..!
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం.. ఆ విషయాల్లో మనమే నెంబర్ వన్
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం.. ఆ విషయాల్లో మనమే నెంబర్ వన్
ఐశ్వర్యతో విడాకుల రూమర్లు.. ఎట్టకేలకు స్పందించిన అభిషేక్
ఐశ్వర్యతో విడాకుల రూమర్లు.. ఎట్టకేలకు స్పందించిన అభిషేక్
గోదావరి స్పెషల్ తాటి గారెలు.. రుచితో పాటు ఆరోగ్యం..
గోదావరి స్పెషల్ తాటి గారెలు.. రుచితో పాటు ఆరోగ్యం..
ఖరీదైన కారు కొన్న ఖుషీ కపూర్..
ఖరీదైన కారు కొన్న ఖుషీ కపూర్..
కార్ల అమ్మకాల్లో క్రెటా పరుగులు..జూలైలో టాప్ సెల్లింగ్ కార్స్ ఇవే
కార్ల అమ్మకాల్లో క్రెటా పరుగులు..జూలైలో టాప్ సెల్లింగ్ కార్స్ ఇవే
తృటిలో 7 పతకాలను కోల్పోయిన భారత అథ్లెట్లు.. లిస్టులో ఎవరున్నారంటే
తృటిలో 7 పతకాలను కోల్పోయిన భారత అథ్లెట్లు.. లిస్టులో ఎవరున్నారంటే
క్రెడిట్ కార్డుల అప్పు వేధిస్తుందా..?అప్పుల బాధకు చెక్ పెట్టండిలా
క్రెడిట్ కార్డుల అప్పు వేధిస్తుందా..?అప్పుల బాధకు చెక్ పెట్టండిలా
బిగ్ బాస్ కొత్త ప్రోమో చూశారా? అందమైన అమ్మాయిలతో నాగ్ డ్యాన్స్
బిగ్ బాస్ కొత్త ప్రోమో చూశారా? అందమైన అమ్మాయిలతో నాగ్ డ్యాన్స్
నటుడు మోహన్ బాబుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు..
నటుడు మోహన్ బాబుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు..